Health Alert : ఉప్పు కొంచెం ఎక్కువైనా.. తీపి రోగం రావటం ఖాయం అంట..

ఉప్పు లేకుండా వంటచేయడం అసాధ్యం. ఉప్పు లేని కూరను నోట్లో కూడా పెట్టలేమన్న సంగతి మనకు బాగా తెలిసిందే. కానీ ఈ ఉప్పును అధికంగా వాడితే మాత్రం Blood pressure తో పాటుగా డయాబెటిస్ వ్యాధి బారిన పడటం పక్కాగా జరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కూరలో ఎన్ని మసాలా దినుసులు వేసినా.. ఉప్పు వేసేదాకా ఆ కూరకు రుచే ఉండదు కదా. కూరలో ఉప్పు కొంచెం తగ్గినా.. ఆ కూర టేస్ట్ ఉండదని మనకు తెలుసు. అందుకే చాలా మంది తినేటప్పుడు ముందస్తు జాగ్రత్తగా ఉప్పును దగ్గరే పెట్టుకుంటుంటారు. అయితే ఉప్పును మోతాదుకు తింటే ఏ సమస్యా లేదు కానీ.. మోతాదుకు మించితేనే అసలుకే ఎసరులా తయారవుతుంది.

ఉప్పును అధికంగా తినేవారిలో రక్తపోటు సమస్య వస్తుందన్న విషయం ఎంతో మందికి తెలుసు. ఇక కొత్తగా ఉప్పును అధికంగా తింటే డయాబెటిస్ -2 టైప్ బారిన పడతామని పరిశోధకులు స్పష్టం చేశారు. అవును ఉప్పును మోతాదుకు మించి తీసుకోవడం వల్ల మధుమేహం ముప్పు పొంచి ఉందని పరిశోధనలో వెల్లడైంది.  చక్కెర, పండ్ల రసాలు, తీపి ఆహార పదార్థాలతో డయాబెటిస్ వస్తుందని ఇదివరకే మనకు తెలుసు. ఇక తాజాగా ఉప్పు ద్వారా కూడా డయాబెటిస్ వస్తుందని మేయో క్లినిక్ ప్రొసీడింగ్స్ జర్నల్‌లో  ప్రచురించబడిన  అధ్యయనం ద్వారా తెలుస్తోంది. ఈ అధ్యయనం ప్రకారం.. రోజుకు  రెండు టీ స్పూన్ల ఉప్పుును తీసుకునే వారిలో డయాబెటిస్ ముప్పుు  ఎక్కువగా ఉన్నట్టు శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నా. ఉప్పును మోతాదుకు మించి తీసుకోవడం వల్ల డయాబెటీస్ టైప్ 2  పేషెంట్ల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ ఉప్పు Insulin production కు అడ్డుపడటంతోనే డయాబెటీస్ బారిన పడుతున్నారని నిపుణులు చెబుతున్నారు. 

కొంతమంది ఆహారం తీసుకొనేటప్పుడు టేబుల్ సాల్ట్ వాడతారని దీని వల్ల టైప్ 2 మధుమేహం 40 శాతం పెరిగే  అవకాశం ఉందని కొత్త పరిశోధనలో తేలిందని తులనే యూనివర్సిటీ పరిశోధకులు   చెబుతున్నారు. మేయో క్లినిక్ ప్రొసీడింగ్స్ జర్నల్‌లో ప్రచురించబడిన ఈ అధ్యయనం UK బయోబ్యాంక్ నుండి 37... 73 సంవత్సరాల మధ్య వయస్సు గల 4,00,000 మంది UK పెద్దల డేటాను పరిశీలించారు.    ఇది ఐదు మిలియన్లకు పైగా బ్రిటిష్ ప్రజల జీవన శైలి.. వైద్య విధానాన్ని పరిశీలించారు.   12 సంవత్సరాల తరువాత 13 వేల  మందికి పైగా ప్రజలు టైప్-2 మధుమేహాన్ని కలిగి ఉన్నారని అధ్యయనం ద్వారా తెలుస్తోంది.

అధికంగా ఉప్పును తీసుకోవడం వల్ల వెయిట్ పెరగడంతో పాటుగా, గుండె సంబంధించిన రోగాలు కూడా వచ్చే అవకాశముందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఉప్పుతో డయాబెటిస్ బారిన పడకుండా ఉండాలంటే మాత్రం రోజు 1500 మి. గ్రా లకు మించి ఉప్పును వినియోగించడకూడదని నిపుణులు చెబుతున్నారు.పెరుగు, పచ్చళ్లు, చిరుతిండ్లు, కూరల్లో ఉప్పు తక్కువగా ఉందని ఇంకా వేసుకుంటే మాత్రం డయాబెటిస్, అధిక బరువు, రక్తపోటు, గుండె సంబంధిత రోగాలను కొని తెచ్చుకున్నవారవుతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఇక కూరల్లో ఉప్పును తక్కువగా వేయడం అలవాటు చేసుకోండి. బయటఫుడ్ కు సాధ్యమైనంత వరకు దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఉప్పు చాల్లేదు అని భావిస్తే ఉప్పును కాకుండా మిరియాల పౌడర్ ను వాడండి. మొదట్లో కాస్త ఇబ్బంది పడినా.. ప్రతి రోజూ అలాగే చేస్తే మీ రుచి నాలికలు కూడా అలవాటు పడతాయి. దీంతో మీకు డయాబెటిస్ వచ్చే అవకాశం లేదని వైద్య నిపుణులు చెబుతున్నారు. 

ALSO READ : అదిరేటి అందం కోసం.. ముఖం దీపంలా వెలగాలంటే.. పాటించాల్సిన చిట్కాలు ఇవే. . .