కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో దివ్యాంగుల క్రీడా పోటీలు ప్రారంభం

కరీంనగర్ టౌన్,వెలుగు : దివ్యాంగులు క్రీడల్లో చూపిస్తున్న ప్రతిభ, స్ఫూర్తి అందరికీ ఆదర్శమని కలెక్టర్ పమేలాసత్పతి అన్నారు.  మంగళవారం కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని అంబేద్కర్  స్టేడియంలో దివ్యాంగులకు నిర్వహిస్తున్న ఆటలపోటీలను మేయర్ సునీల్‌‌‌‌‌‌‌‌రావుతో  కలిసి కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డిసెంబర్ 3న దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ఈ పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.  

అనంతరం దివ్యాంగుల డాన్సులు, పాటలు అలరించాయి.  అంతకుముందు కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌లో ‘జిల్లా నీరు–పారిశుధ్య మిషన్‌‌‌‌‌‌‌‌’ కార్యక్రమంపై సిటీలోని వివిధ స్కూళ్ల స్టూడెంట్లకు, హాస్పిటల్స్‌‌‌‌‌‌‌‌ సిబ్బంది, మున్సిపల్​ కార్మికులకు అవగాహన కల్పించారు.  మానకొండూర్ మండల కేంద్రంలోని జడ్పీ బాయ్స్​ హైస్కూల్‌‌‌‌‌‌‌‌లో  హెచ్‌‌‌‌‌‌‌‌ఎం శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవం నిర్వహించారు.