మంత్రులు, ఎమ్మెల్యేలకు ఆటలపోటీలు

  • ఏటా బడ్జెట్ సమావేశాల టైంలో నిర్వహించాలని స్పీకర్​ను కోరిన సీఎం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పిల్లలు, యువతను క్రీడల వైపు ప్రోత్సహించడంలో భాగంగా ఏటా ఎమ్మెల్యేలు, మంత్రులకు క్రీడలు, ఇతర సాంస్కృతిక పోటీలు నిర్వహించాలని స్పీకర్‌‌‌‌‌‌‌‌ గడ్డం ప్రసాద్‌‌‌‌ ను సీఎం రేవంత్‌‌‌‌ రెడ్డి కోరారు. ఇందుకోసం ఆల్‌‌‌‌ పార్టీ సభ్యులతో ఓ కమిటీని ఏర్పాటు చేసి, విధి విధానాలను ఖరారు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శుక్రవారం అసెంబ్లీలో ఈ అంశంపై ఆయన మాట్లాడారు. 

క్రీడా స్ఫూర్తిని నింపేందుకు గతంలో శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులకు స్పోర్ట్స్ ఈవెంట్ నిర్వహించేవారని రేవంత్ గుర్తుచేశారు. ఆ సమయంలో వివిధ నాటకాలు, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించేవారని, వాటిల్లో ఎమ్మెల్యేలు పాల్గొని తమలో ఉన్న టాలెంట్‌‌‌‌ను బయటపెట్టే వారని ఆయన తెలిపారు. రాష్ట్రంలోని పిల్లలు, యువతలో క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలను ప్రోత్సహించేందుకు ఇటువంటి ఈవెంట్లు దోహదపడుతాయని సీఎం అభిప్రాయపడ్డారు. అందుకే వాటిని పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని, ఏటా బడ్జెట్ సమావేశాల సమయంలో స్పోర్ట్స్ ఈవెంట్ నిర్వహించాలని స్పీకర్‌‌‌‌‌‌‌‌కు సీఎం విజ్ఞప్తి చేశారు.