నిజామాబాద్ జిల్లాలో .. ఎల్ఆర్ఎస్ వెరిఫికేషన్ స్పీడప్

  • అర్హత గల అప్లికేషన్లు ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌లో నమోదు  
  • ఫీల్డ్​విజిట్​కోసం పల్లె, పట్టణాలకు టీంల ఏర్పాటు​​ 
  • కలెక్టర్​ ఆధ్వర్యంలో రోజువారీ  సమీక్ష 

నిజామాబాద్​, వెలుగు: నిజామాబాద్ జిల్లాలో ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను పరిష్కరించే దిశగా వేగంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి.  నగర పాలిక, మున్సిపాలిటీల్లో కలిపి 59,028 అప్లికేషన్​లతో పాటు విలేజ్​ల నుంచి వచ్చిన సుమారు 19,200 దరఖాస్తులకు మోక్షం కలగనుంది. ఈ విషయంలో గవర్నమెంట్​ సీరియస్​గా ఉన్నందున కలెక్టర్​ రాజీవ్​గాంధీ హనుమంతు ప్రతి రోజు ప్రగతిని సమీక్షిస్తున్నారు. ఫీల్డ్ ​ విజిట్​ చేసి దరఖాస్తులను పరిష్కరించేందుకు  స్పెషల్​ టీంలు ఏర్పాటు చేయడంతో స్పీడ్​గా వర్క్​ జరుగుతోంది. 

గవర్నమెంట్​ సర్వే నంబర్లు లేకుండా

జిల్లాలో నగరపాలిక, బోధన్​, ఆర్మూర్​, భీంగల్​ మున్సిపాలిటీలతో పాటు నుడా పరిధిలోని 86 విలేజ్​లు కలిపి ఎల్ఆర్ఎస్​ కోసం 59,028 దరఖాస్తులు రాగా 530 గ్రామ పంచాయతీల నుంచి 19,200 ఆర్జీలు ఆన్​లైన్​లో గత బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌ గవర్నమెంట్ తీసుకుంది.  వాటి పరిష్కారాన్ని పక్కన పడేయడంతో నాలుగేండ్ల నుంచి అర్జీదారులు ఇబ్బందిపడుతున్నారు. కాంగ్రెస్​ సర్కారు వాటిని పరిశీలించాలని నిర్ణయించి కలెక్టర్​లకు ఆదేశాలు జారీ చేసింది. 

నాన్​లేఅవుట్​ఇంటి జాగాలను రెగ్యులైజ్​ చేయడం ద్వారా గవర్నమెంట్​కు ఇన్​కం రావడంతో పాటు ఇంటి స్థలాల ఓనర్ల సమస్య పరిష్కరించినట్లవుతుందని నిర్ణయించింది. ఎండోమెంట్, వక్ఫ్​, కోర్టు వివాదాలు లేని వాటిని క్రమబద్ధం చేయడానికి ఫీల్డ్​ వర్క్ మొదలైంది. పట్టణాల పరిధిలోని చెరువు శిఖం ల్యాండ్స్​ ఎల్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌లోకి రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.  

వేరువేరుగా టీంలు

మున్సిపాలిటీ పరిధిలోని ఎల్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ పరిశీలన బాధ్యతలను  టౌన్​ప్లానింగ్​ ఆఫీసర్​, రెవెన్యూ ఆఫీసర్​, ఇరిగేషన్​, కమిషనర్​, నుడా సీఈవోలకు ఇవ్వగా గ్రామ పంచాయతీల దరఖాస్తుల పరిశీలన డీఎల్​పీవో, డీపీవో అదనపు కలెక్టర్​ (లోకల్​ బాడీస్)​ చూస్తారు. ఇందులో అర్హత ఉన్న ఆర్జీలను ఆన్​లైన్​లో నమోదు చేసి రెగ్యులైజేషన్​ ఫీజుకు రికమెండ్​ చేస్తున్నారు. 

ఇప్పటి వరకు టౌన్​ల పరిధిలో 9 వేల దరఖాస్తుల ఫీల్డ్​ విజిట్​ పూర్తయింది. నిత్యం సమీక్షిస్తున్న కలెక్టర్ ఆఫీసర్లతో కలిసి తాను కూడా పరిశీలనలో పాల్గొంటున్నారు. ప్రత్యేకంగా తయారు చేయించిన మొబైల్​ యాప్​లో ఎల్​ఆర్​ఎస్​ వివరాలు ఎంటర్​ చేశారు. సర్వే నంబర్​, రోడ్​ విస్తీర్ణం, ప్లాట్​ నంబర్​ను క్షేత్ర పరిశీలన తరువాత నమోదు చేయిస్తున్నారు. ఆఫీసర్ల టీం విజిట్​ చేసే సమాచారాన్ని దరఖాస్తుదారులకు చెప్పి వారూ అందుబాటులో ఉండేలా చూస్తున్నారు.