ఎంత స్పీడ్‌గా వెళ్తున్నారో తెలుసుకోవాలనుకుంటున్నారో.. ఇదిగో స్పీడోమీటర్

ఎంత స్పీడ్​గా వెళ్తున్నామో తెలుసుకునేందుకు బైక్​, కార్లలో స్పీడో మీటర్​ ఉంటుంది. కానీ.. సైకిల్​ తొక్కుతున్నప్పుడు స్పీడ్​ని ఎలా తెలుసుకోవాలి? ఈ గాడ్జెట్​ని సైకిల్​కి బిగించుకుంటే సరిపోతుంది. దీన్ని శివెగ్జిమ్​ అనే కంపెనీ తీసుకొచ్చింది. ఇది స్పీడో మీటర్​ మాత్రమే కాదు.. హార్న్​, ఫ్రంట్​ లైట్​గా కూడా పనిచేస్తుంది. దీని డిస్​ప్లేలో స్పీడ్​తోపాటు రైడింగ్​ ​టైం, దూరాన్ని కూడా రికార్డ్​ చేసి చూపిస్తుంది. దీనికి ఉండే ఎల్​ఈడీ లైట్​ చీకట్లో రైడింగ్​ చేసేటప్పుడు సైకిల్ ఫ్రంట్ లైట్​లా ఉపయోగపడుతుంది. 350 ల్యూమన్స్​ బ్రైట్​నెస్​తో వెలుగుతుంది.

165 అడుగుల వరకు వెలుతురునిస్తుంది. ఇందులో లైటింగ్​ అడ్జస్ట్​మెంట్​ చేసుకోవడానికి ప్రత్యేకంగా 4 లైటింగ్ మోడ్స్​ ఉంటాయి. దీనికి ఉండే హార్న్ కూడా చాలా పవర్​ఫుల్​.120 డెసిబుల్స్​ సౌండ్​ని రిలీజ్​ చేయగలదు. అంతేకాదు.. 6 సౌండ్​ మోడ్స్​ ఉంటాయి. వాటిలో నచ్చిన ట్యూన్​లో  హార్న్​ని సెట్​ చేసుకోవచ్చు. హార్న్​ కోసం ప్రత్యేకంగా కంట్రోలర్​ వస్తుంది. దీన్ని హై క్వాలిటీ ఏబీఎస్​ మెటీరియల్‌‌తో తయారు చేశారు. వర్షంలో తడిసినా పాడవ్వకుండా ఉండేందుకు IPX65 రేటింగ్​తో తీసుకొచ్చారు. ఇందులో1500mAh బ్యాటరీ ఉంటుంది. మైక్రో యూఎస్​బీతో ఛార్జ్​ చేసుకోవచ్చు. 2–3 గంటల్లో ఫుల్​ ఛార్జ్ అవుతుంది. ఒకసారి ఫుల్​ ఛార్జ్​ చేస్తే 5–8 గంటలు వాడుకోవచ్చు. దీన్ని ఇన్​స్టాల్​ చేయడం కూడా చాలా ఈజీ.

ధర : 1,020 రూపాయలు