బెల్ట్​షాప్​లపై ప్రత్యేక నిఘా

లింగంపేట, వెలుగు: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో  బెల్ట్​షాప్​లపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు ఎల్లారెడ్డి ఆబ్కారీ సీఐ షాకీర్​అహ్మద్​ పేర్కొన్నారు. లింగంపేటలో మంగళవారం నిర్వహించిన ప్రెస్​మీట్​లో ఆయన మాట్లాడారు. ఎల్లారెడ్డి ఎక్సైజ్​పరిధిలోని నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డి, లింగంపేట, గాంధారి మండలాల్లో బెల్టు షాప్​లు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. 

ఎక్సైజ్​పరిధిలో 3 నెలల్లో 22 మందిపై కేసులు నమోదు చేసి 19 మందిని అరెస్ట్​చేసినట్లు తెలిపారు. 297 లీటర్ల లిక్కర్​ను స్వాధీనం చేసుకొని, ఏడు వెహికల్స్​ను సీజ్​చేశామన్నారు. బెల్టు షాప్​లు నిర్వహిస్తే తమకు సమాచారం ఇవ్వాలని, సమాచారం తెలిపిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు. ఆయన వెంట ఎక్సైజ్​ సిబ్బంది ఉన్నారు.