దేశంలో హోలీ చాలా చోట్ల జరుపుకుంటారు. కానీ హంపిలో ఆడే హోలీ ప్రత్యేకం ఎందుకంటే.. ఎక్కడెక్కడి నుంచో విదేశీయులు వస్తారు. స్థానికులతో కలిసిపోయి రంగులు పూస్తారు. డ్యాన్స్ చేస్తారు. హోలీ సమయంలో హంపి వెళ్తే... మనం దేశంలోనే ఉన్నామా? విదేశంలోనా? అన్న అనుమానం కలుగుతుంది.
సమ్మర్ ట్రిప్ కోసం ఇండియాకు వచ్చే విదేశీ అని కేకలు వేస్తారు. నిమిషాల్లో పంపికలలో పర్యాటకులు జనవరి, ఫిబ్రవరిలో గోకర్ణ, గోవాను సందర్శిస్తారు. హోలీ సమయానికి హంపికి వచ్చేస్తారు. స్థానికులతో కలిసి హోలీని ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు.. ఇక్కడ హోలీని సంప్రదాయబద్ధంగా మూడు రోజులు జరుపుతారు. మొదటి రోజు వీధుల్లో కోలాటాలు ఆడతారు. విదేశీయులు కూడా.ఇక్కడి వాళ్లతో కలిసి నృత్యాలు చేస్తారు. రెండవ రోజు హోలీ కా దహన్ చేస్తారు. సాయంత్రం వేళ కట్టెలు, పిడకలతో మంటను, ఏర్పాటు చేసి దాని ముందు కూచుని సంగీతం వాయిస్తూ గడుపుతారు. ఇక మూడో రోజు మొదలవుతుంది అసలు సంబురం. ఉదయం ఆరింటి నుంచి పిల్లలు, పెద్దలు, విదేశీయులు రంగులు కొనుగోలు చేస్తూ, వాటిని నీళ్లలో కలుపుతూ ప్రశాంతంగా కనిపిస్తుంది. తొమ్మిది అవ్వడం ఆలస్యం హడావుడి మొదలు. ఆ సందడి అలా ఇలా ఉండదు.. డప్పుల శబ్దంతో మారుమ్రోగిపోతుంది. సిద్ధం చేసిన రంగులు, రంగు నీళ్లు ఎవరు కనిపిస్తే వాళ్ల మీద చల్లుతూ హ్యాపీ హోలీ మారిపోతుంది. విరూపాక్ష ఆలయం వీధంతా రంగుల మయం అవుతుంది. స్థానికులు, విదేశీయులు అని లేదు. రంగులు లేకుండా నీట్ గా ఎవరైనా ఎదురు పడితే చాలు.. వాళ్లని రంగుల్లో ముంచి తీయాల్సిందే.. రంగులు. చల్లడంలో తేడాలుండవు. ఎవరు ఎవరో గుర్తుపట్టలేనంతగా రంగుల్లో మునిగిపోతారు. విదేశీ పర్యాటకులు ఇక్కడి వాళ్లకన్నా ఎక్కువ ఎంజాయ్ చేస్తారు. ఆటలు, పాటలతో వీధి వీధంతా హోరెత్తిపోతుంది. నాలుగు గంటల పాటు అక్కడ సాగే సంబురం అంతా. ఇంతా కాదు. మధ్యాహ్నానికి ఆ సందడి కాస్త ముగుస్తుంది. ఆ తర్వాత అందరూ తుంగభద్ర నదికి వెళ్లారు. రంగులు పోయేదాకా అక్కడ ఈతలు కొట్టి.. తీరిగ్గా బసకు చేరుకొని సేదతీరుతారు. ఇదీ అక్కడి హోలీ సందడి.
మిగతా రోజుల్లో కూడా..
హోలీ పండగప్పుడే కాదు. మామూలు రోజుల్లో కూడా హంపి పర్యాటకులతో సందడిగా ఉంటుంది. హంపిని వరల్డ్ హెరిటేజ్ సైట్ గా అంతర్జాతీయ సంస్థ యునెస్కో గుర్తించింది. ప్రతి సంవత్సరం వేలాదిమంది పర్యాటకులు ఇక్కడికి వస్తారు. హంపి శిధిలాలు. చూడాలంటే, స్థానికంగా ఒక సైకిల్ అద్దెకు తీసుకొని దానిపై తిరుగుతూ చూడొచ్చు. ఇక్కడి దేవాలయాలు, రాతిరథం, మ్యూజికల్ పిల్లర్స్, పురావస్తు మ్యూజియం చూడదగ్గ ప్రదేశాలు. దీనిని ఆనాటి కాలంలో కిష్కింధ అని కూడా అనే వారని చరిత్ర చెపుతోంది.
విలాసాల హిప్పీ
తుంగభద్ర అవతలి ఒడ్డున హిప్పీ ఐలాండ్ ఉంటుంది. ఇది వినోదాలకు, విలాసాలకు అడ్డా. చుట్టూ పచ్చని పొలాలు.. మధ్యలో వెదురు కాటేజీలు.. దాబాలు.. కాస్కాటిక్స్, డెకరేటివ్ ఐటమ్స్ అమ్మే దుకాణాలు, విదేశీ వాయిద్యాలు అమ్మే కొట్లు, విదేశీ రుచుల రెస్టారెంట్లు.. ఇలా ఎన్నో ఉంటాయి. హంపికి వెళ్లే విదేశీయులు ఉదయం అంతా ఆలయాలు, గోపురాలు చూసి.. సాయంత్రం అయ్యేసరికి హిప్పీ ఐలాండ్ కు చేరుకుంటారు. హంపిలో విడిదికి థోకాలేదు. హంపి.వీధుల్లోని దాదాపు అన్ని ఇళ్లు అతిథులకు ఆహ్వానం పలుకుతాయి. రూ.500 నుంచి రూ.1,000 లోపు అద్దె చెల్లిస్తే చాలు మంచి వసతి దొరుకుతుంది. హిప్పీ ఐలాండ్లో కాటేజీలు మాత్రం కాస్త ఎక్కువ ధర ఉంటాయి. రూ.3,000 నుంచి రూ.5,000 వరకు ఉంటాయి. భోజనం కూడా బాగానే ఉంటుంది. స్థానిక రుచులతో పాటు దేశీ, విదేశీ వంటకాలు అందించే హోటళ్లు చాలానే ఉన్నాయి.
ఎలా వెళ్లాలి?
హంపికి బస్ లేదా విమానంలో వెళ్లాలంటే హైదరాబాద్ నుంచి బళ్లారి వెళ్లాలి. అక్కడి నుంచి హంపి 60కిలోమీటర్లు. బస్ లేదా క్యాబ్లో వెళ్లొచ్చు. హంపికి దగ్గర్లో హోస్పేట్ రైల్వే స్టేషన్ ఉంది.. ఇక్కడి నుంచి హంపి 13 కిలోమీటర్లు. ఈ స్టేషన్ నుంచి ట్యాక్సీలు, క్యాబ్ లు అందుబాటు లో ఉంటాయి. కారులో వెళ్లాలంటే ఇక్కడి నుంచి సుమారు 380 కిలోమీటర్లు ఉంటుంది. మహబూబ్ నగర్, రాయ్ చూర్ మీదుగా వెళ్లొచ్చు.