ఆధ్యాత్మికం: కోరికలు తీరాలంటే ఏంచేయాలి...

 కోరికలు లేని మానవుడు ఉండడు.. జన్మించడు.. అసలు కోరికలు తీర్చుకొనేందుకు మానవ జన్మ ... కోరికలు తీరికకుండా ఉన్న ఆత్మ మనిషి గర్భంలోకి.. ఇద్దరు మనుషుల కలయిక ద్వారా  గర్భంలోకి ప్రవేశిస్తుంది.  అందుకే..ఆత్మకి పుట్టుక లేదు, ఎన్నటికీ మరణం కూడా ఉండదు. ఒకప్పుడు ఉండి, ఇకముందు ఎప్పుడైనా ఉండకుండా ఉండదు. ఆత్మ జన్మ లేనిది, నిత్యమైనది, శాశ్వతమైనది. వయసు లేనిది... శరీరం నశించి పోయినా అది నశించదు' అని గీతా, ఉపనిషత్తులు చెప్తున్నాయి. కానీ, తల్లి గర్భాన పడటం, సంసారంలో చిక్కుకోవడం, చనిపోవడం, మళ్లీ పుట్టడం ఇలా చక్రంలా తిరుగుతోంది. మరి, ఆత్మకు ఈ తిప్పలు తప్పేదెప్పుడు?

కోరికల వల్లే.. కోటి జన్మలు

ఓ ఇంట్లో వేడుకలు జరుగుతున్నాయి. ఘుమఘుమలాడే ఆహార పదార్థాలు వంటగదిలో సిద్ధమవుతున్నాయి. అ ఇంటికి పక్కనే ఉన్న పిల్లి ముక్కుపుటాలకు ఆ వాసన తగిలింది. మెల్లిగా గోడ దూకి ఆ గదిలోకి వెళ్లే ప్రయత్నం చేసింది. అది చూసిన ఇంటి యాజమాని కర్రతో కొట్టి, దాన్ని బయటకు వెళ్లగొట్టాడు. పిల్లి మనసు మారలేదు. మరోవైపు నుంచి గదిలోకి దూకేందుకు ప్రయత్నించింది. మళ్లీ దెబ్బలపాలైంది. చివరకు వేడుక పూర్తయ్యేదాకా వేచి ఉండి..

ఆ రాత్రి మరోసారి ప్రయత్నించింది. ఇంట్లో వాళ్లంతా పడుకున్నారు. పిల్లి కిటికీలో నుంచి వంటగదిలోకి వెళ్లింది. పాత్రలో అడుగున మిగిలిన పాయసాన్ని తిని తల బయటకు తీయబోయింది. చిన్న పాత్ర కావడంతో దాని తల దాంట్లో ఇరుక్కు పోయింది!  భయం ఓ వైపు బయటకు పోవాలన్న తపన మరోవైపు దీనితో దాని పరిస్థితి దయనీయంగా మారింది. తలను బయటకు తీసే ప్రయత్నంలో గదంతా పరుగులు తీసింది. 

గిన్నెలు కిందపడుతున్న అలికిడి దీని పక్కగదిలో వాళ్లంతా నిద్రలేచారు. పిల్లికి నాలుగు తగిలించి బయటకు పంపారు.. అది ఊపిరి పీల్చుకుందో లేదో మరోఇంటి వంటగది వైపు పరుగెత్తింది. మనుషులు కూడా ఇలాగే మమకారాలనే మోజుతోనే మళ్లీ మళ్లీ ఈ లోకంలోకి ప్రవేశిస్తున్నారు.. పశ్చాత్తాపమున్నా లేకుండా లోలకంలా కటూ ఇటూ ఊగులాడుతూ తిప్పలు పడుతున్నారు.

ఎన్నాళ్లీ రాకపోకలు?

"మళ్లీ పుట్టడం, మరణించడం, తల్లి గర్భాన పడటం. ఇలాంటి దాటశక్యం కాని సంసారం నుంచి నన్ను దయతో రక్షించు మాధవా' అని సన్యాసులు వేడుకుంటూ ఉంటారు. ఈ జీవితాలు నిజంగా ఆనందాన్నే ఇస్తున్నాయా? వస్తువులనూ, విషయాలనూ అనుభవించేటప్పుడు ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. నిజంగా వీటి వల్ల నేను సంపూర్ణమైన పొందుతున్నానా? అది మనసులో ప్రశ్నించుకుంటూ ఉండాలి అలాంటి ప్రయత్నాలు చేయకపోవడం వల్ల, వాటి మీద విముఖత కలగకపోవడం వల్లనే ఆ సుఖాల కోసం జన్నలు ఎత్తల్సి వస్తుంది, మళ్లీ ఈ ప్రపంచంలోకి ప్రవేశిస్తూ పడరాని కష్టాలు పడాల్సి వస్తుంది.

ప్రహ్లాదుని సందేశం

జీవితంలో పడరాని కష్టాలు పడుతున్న వాళ్లను ఉద్దేశిస్తూ.. గురుకులంలో ఉన్నప్పుడు ప్రహ్లాదుడు తన మిత్రులకు ఇలా చెప్తాడు.." మీరు చూస్తున్నారు కదా! మసదారు గృహస్త జీవితం గడుపుతూ పడుతున్న కష్టాలు సంతోషం కోరుకుంటారే కానీ, పిచ్చిని మాత్రం విడిచి పెట్టరు సంసారం అనే ఊబిలో ఊరికే  కూరుకుపోతుంటారు. గర్భం నుంచి నావా అవస్తలు పడి పుడుతూ ఉంటారు మనిషి కానీ, తన గురించి తాను తెలుసుకోడు వందల కొద్దీ జన్మలెత్తినా కర్మబంధాల చిక్కుల్లోనుంచి బయటపడలేదు పరమాత్మని చేరుకోలేడు' అని బాధపడుతూ హెచ్చరిస్తాడు

కోరికల కోట... 

కోరికల కోటను బలంగా బారీగా నిర్మించుకుంటారు మనిషి, చివరకు ఆ కోట మొదలు ఏదో, అంతమేదో, బయటపడే మార్గమేదో కూడా తెలుసుకోలేనంత దైన్యానికి దిగజారిపోతాడు. పరిమితమైన ఈ శరీరంతో ఆయుష్షుతో కోరికలు తీరే ప్రసక్తి లేదు. అందుకే వాటిని తీర్చుకోవాలన్న తహతహతో  అనేక జన్మలు ఎత్తుతున్నారు. మాంసం.. ఎముకలు, చర్మంతో ఉన్న ఈ శరీరం ఎవరి వల్ల నిర్మితమైంది" ఎక్కడి నుంచీ వచ్చింది?. దాని స్థితి ఏంటి? దానిలో ఎవరు నివసిస్తారు. అని ఓసారి శ్రీరాముడు వశిష్ట మహర్షిని అడుగుతాడు. అప్పుడు ఆయన "ఓ రామా! ఎముకలు, రక్తమాంసాలతో కూడి తొమ్మిది రంధ్రాలున్న ఈ శరీర గృహాన్ని ఎవ్వరూ నిర్మించలేదు. 

ALSO READ : కార్తీకమాసంలో నదీస్నానం ఎందుకు చేయాలి.. ఆధ్యాత్మికమా.. సైంటిఫిక్​ రీజనా..!

వేల కొద్దీ జన్మలెత్తుతూ, ఈ మాంస, అస్థిమయ దేహమే నేను” అనే భ్రమని గట్టిగా నమ్మడం వల్లే మళ్లీ మళ్లీ కోట్లాది శరీరాలు పుడుతున్నాయి. ఎవరో బలవంతంగా తెచ్చిపెట్టినవి కావు అని చెప్తాడు. అంటే మనిషి చేస్తున్న పనులు వల్లే శరీరాలు, ప్రాప్తిస్తున్నాయి. చావుపుట్టుకల ప్రయాణ ప్రయాసల నుంచి బయటపడాలంటే ఈ లోకంలోని రుణాల మంచి విముక్తి కావాలి కోరికలనూ, కర్మలనూ అనుసరించే ఆధారపడి ఉంటాయని గుర్తుపెట్టుకోవాలి.

కర్మ వదిలితే...

ప్రపంచానికి సంబంధించిన పనులు  ముగించుకోనిదే ప్రశాంతతకూ పరమాత్మకూ దగ్గర కాలేం. లౌకికపరమైన బాధల్ని ఎంత తొందరగా వదిలించుకోగలిగితే, అంత తొందరగా ఉన్నతోన్నతమైన సుఖం లభిస్తుంది. అయితే, చాలామంది కాటికి వెళ్లేవరకూ ఏదో కార్యకలాపాల్లో మునిగి ఆభ్రమలో జనన మరణ చక్రంలో పడి నలిగిపోతూ ఉంటారు. సంసారదుఃఖ సాగరంలో మునకలేస్తూ ఉంటారు. సంస్కారాల ప్రభావంతో మరో జన్మ ఎత్తడం అనివార్యమవుతుంది. అటు, ఇటుగా ఏదేహాన్ని ధరించినా, దానికి సంబంధించిన కష్టనష్టాలు మాత్రం తప్పకుండా భరించాల్సిందే.

పరమాత్మే దిక్కు

ఇన్ని లక్షల జన్మల సంస్కారాల నుంచి బయటపడే తోవను చూపేది మాత్రం ఆ పరమాత్మే! పరమాత్మ ప్రమేయం లేకుండా.. ఆయన ఆడించే ఆట నుంచి తప్పుకునే అవకాశమే లేదు. రంగులరాట్నం ఎక్కిస్తే భయమేస్తోంది. దింపమని ఏడ్చే బిడ్డను తండ్రి ప్రేమతో కిందికి దించుతాడు. అలాగే.. ఈ సంసార నాటకాన్ని నేనిక అదలేను తండ్రీ!” అని వేడుకుంటే పరమాత్మ దయతలిచి ముక్తిని ప్రసాదిస్తాడు.

-వెలుగు, లైఫ్​–