ఆర్మూర్ సిద్ధులగుట్టపై ప్రత్యేక పూజలు

ఆర్మూర్, వెలుగు : టౌన్ లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం   సిద్ధులగుట్టను  సోమవారం  భక్తులు అధిక సంఖ్యలో సందర్శించారు. గుట్టపైన  శివాలయం, రామాలయం, అయ్యప్ప మందిరాల్లో పురోహితులు కుమార్​ శర్మ, నందీశ్వర మహారాజ్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు జరిగాయి.

సామూహిక దత్త పారాయణం, జయది హోమం నిర్వహించారు.  రామాలయం నుంచి జీవ కోనేరు వరకు ఉత్సవ మూర్తులతో పల్లకిసేవ జరిగింది. అనంతరం పోచంపల్లికి చెందిన మనోజ్​ రెడ్డి, లక్షిత కుటుంబీకుల ఆధ్వర్యంలో అన్నదానం కార్యక్రమం నిర్వహించారు.