ఆర్మూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పోలీస్​, ఆర్టీఏ ఆధ్వర్యంలో స్పెషల్​ డ్రైవ్

ఆర్మూర్, వెలుగు: ఆర్మూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పోలీస్, ఆర్టీఏ శాఖ సంయుక్తంగా గురువారం స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. టౌన్​ లోని కొత్తబస్టాండ్​ సమీపంలో స్పెషల్​ డ్రైవ్ నిర్వహించి నిబంధనలు పాటించని వారికి జరిమానాలు విధించారు.

సీఐ రవికుమార్, ఎంవీఐ వివేకానందరెడ్డి, ట్రాఫిక్​ సీఐ రమేశ్ మాట్లాడారు. నెంబర్ ప్లేట్ లేకుండా, మద్యం తాగి వాహనాలు నడిపిస్తే, చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు.