- సిద్ధరామయ్యపై ఎఫ్‌ఐఆర్‌నమోదుకు సిద్ధం!
- లోకాయుక్త పోలీసుల విచారణకు స్పెషల్‌కోర్టు ఆదేశం
బెంగళూరు: కర్నాటకలో అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా) ల్యాండ్ కేటాయింపు విషయంలో ఆ రాష్ట్ర సీఎం సిద్ధరామయ్యను లోకాయుక్త పోలీసులు విచారించాలని స్పెషల్ కోర్టు ఆదేశించింది. ఈ మేరకు స్పెషల్ కోర్టు న్యాయమూర్తి సంతోష్ గజానన్ భట్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే, ఆయనపై ఎఫ్‌ఐఆర్ నమోదుకు అధికారులు సిద్ధం అవుతున్నారు.
ముడా ల్యాండ్ విషయంలో ఆయన భార్య బీఎం పార్వతికి 14 స్థలాలను కేటాయిస్తూ అక్రమాలకు పాల్పడ్డారని గవర్నర్ థావర్‌చంద్ గ్లెహాట్ విచారణకు అనుమతించారు. దీనిని సవాల్ చేస్తూ హైకోర్టులో సిద్ధరామయ్య పిటిషన్ దాఖలు చేయగా, గవర్నర్ ఉత్తర్వులను కోర్టు సమర్థించింది. ఆర్టీఐ కార్యకర్త స్నేహమయి కృష్ణ ముడా ల్యాండ్ స్కామ్‌లో విచారణ జరిపించాలని గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు.
కాగా, స్పెషల్ కోర్టు ఆదేశాలను పిటిషనర్ స్నేహమయి కృష్ణ స్వాగతించారు. ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసిన తర్వాత కేసును సీబీఐకి అప్పగించాలని హైకోర్టును ఆశ్రయిస్తానని చెప్పారు.