ఇంటర్‌నేషనల్ స్పేస్ స్టేషన్‌కు చేరుకున్న.. స్పేస్ ఎక్స్ క్రూ 9 మిషన్

అంతరిక్షంలో చిక్కుకున్న ఆస్ట్రోనాట్స్ సునితా విలియమ్స్, బుచ్ విల్ మోర్ లను తిరిగి భూమి మీదకు తీసుకురావడానికి స్పేస్ ఎక్స్ క్రూ 9 మిషన్ పంపించారు. ఈ మిషన్ ను సెప్టెంబర్ 28 రాత్రి 10.46 గంటలకు ఫ్లొరిడాలోని కేప్ కెనావెరల్ నుంచి ప్రయోగించినట్లు నాసా తాజాగా వెళ్లడించింది. ఆదివారం సాయంత్రం 5గంటలకు ISS దగ్గరకు ఆ రాకెట్ చేరుకుంది. ఈ రాకెట్ అంతరిక్షంలోని వ్యోమగాములను తీసుకుని ఫిబ్రవరిలో తిరిగి రానున్నారు. 

ఇందులో సాధారణంగా నలుగురు ప్రయాణించవచ్చు. నిక్ హేగ్, రష్యన్ కాస్మోనాట్ అలెగ్జాండర్ గోర్బునోవ్ ఆస్ట్రోనాట్స్ మాత్రమే అందులో వెళ్లారు.  మిగిలిన రెండు సీట్లు సునీత, విల్ మోర్ ల తిరుగు ప్రయాణానికి కేటాయించబడ్డాయని నాసా తెలిపింది.  

Also Read : ఐఐటీల్లో డ్యుయల్​ డిగ్రీ, పీజీకి జామ్

ఎనిమిది రోజుల మిషన్ లో భాగంగా సునీతా విలియమ్స్, బుచ్ విల్ మోర్ లు జూన్ 6న బోయింగ్ స్టార్ లైనర్ క్యాప్సుల్ లో అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే స్టార్ లైనర్ లో సమస్యలు తలెత్తడంతో ఈ ఇద్దరు వ్యోమగాములూ అంతరిక్షంలో చిక్కుకుపోయారు. ఈ క్రమంలో వారిని తిరిగి తీసుకొచ్చేందుకు నాసా మరో మిషన్ స్పేస్ ఎక్స్ క్రూ 9 స్టార్ట్ చేసింది.