పోలీస్ స్టేషన్ కొచ్చే వారికి సత్వరమే న్యాయం  : ఎస్పీ శరత్ చంద్ర పవార్ 

  • ఫిర్యాదుల పరిష్కారం కోసమే మీట్ యువర్ ఎస్పీ 

దేవరకొండ(చింతపల్లి), వెలుగు : పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితుల లకు సత్వరమే న్యాయం చేయాలని  ఎస్పీ శరత్ చంద్రపవార్ అన్నారు. శుక్రవారం దేవరకొండ సబ్ డివిజన్ లోనిచింతపల్లి పోలీస్ స్టేషన్ లో మీట్​ యువర్​ ఎస్పీ కార్యక్రమం  నిర్వహించారు. బాధితుల నుంచి ఫిర్యాదు స్వీకరించి, నేరుగా వారితో మాట్లాడారు. అనంతరం   పోలీస్ స్టేషన్ సిబ్బంది పనితీరు, పోలీస్ స్టేషన్ పరిధిలోని పరిస్థితులను  ఎస్సై యాదయ్యను అడిగి తెలుసుకున్నారు. రిసెప్షన్, స్టేషన్ రైటర్, లాక్అప్, ఎస్ హెచ్ ఓ రూమ్ ను పరిశీలించారు.

 ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ .. ప్రతి వారాని కి ఒకసారి మండల పోలీసు స్టేషన్​లో మీట్ యువర్ ఎస్పీ కార్యక్రమం ఉంటుందని, ప్రజలు  ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.  ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటూ    సమస్యలను పరిష్కరించాలని సిబ్బందికి సూచించారు.  సైబర్ నేరాల పట్ల ప్రజలు తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలని చెప్పారు.

 నిత్యం నిఘా ఏర్పాటు చేసి  తనిఖీలు నిర్వహించాలని, పగలు, రాత్రిపెట్రోలింగ్ నిర్వహించాలని చెప్పారు. అంతకుముందు చింతపల్లి సాయిబాబా దేవాలయాన్ని  దర్శించుకొని ప్రత్యేక పూజకార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం మండల కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న పోలీస్ స్టేషన్​ భవనాన్ని పరిశీలించి నాణ్యతతో త్వరితగతన పూర్తిచేయాలన్నారు. ఎస్పీవెంట దేవరకొండ డీఎస్పీ గిరిబాబు,సీఐ నవీన్ కుమార్,ఎస్సై యాదయ్యపోలీస్ స్టేషన్ సిబ్బందిఉన్నారు.