ఇబ్రహీంపట్నం పోలీస్​ స్టేషన్​ను తనిఖీ చేసిన ఎస్పీ

మెట్ పల్లి, వెలుగు: ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ ను ఎస్పీ అశోక్ కుమార్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ పరిసరాలను, రిసెప్షన్, స్టేషన్ రైటర్, ఎస్ హెచ్ వో, రెస్ట్ రూమ్, లాకప్​ రూమ్ ను పరిశీలించారు. డయల్ 100 కాల్స్​పై సిబ్బంది అలర్ట్​గా ఉండాలని, బ్లూకోల్ట్స్, పెట్రోల్ కార్ నిరంతరం గస్తీ నిర్వహించాలని సూచించారు.

ఫిర్యాదులపై నిర్లక్ష్యంగా ఉంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. సైబర్ నేరాల పట్ల ప్రజలను, యువతను అప్రమత్తం చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో డీఎస్పీ ఉమామహేశ్వర రావు, మెట్ పల్లి సీఐ నిరంజన్ రెడ్డి, ఎస్ఐ అనిల్ పాల్గొన్నారు.