దళారులకు వడ్లు అమ్మొద్దు : ఎస్పీ అఖిల్ మహాజన్

ఎల్లారెడ్డిపేట,వెలుగు : దళారులకు వడ్లు అమ్మి రైతులు మోసపోవద్దని ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. గురువారం ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట మండలాల్లోని పలు గ్రామాల్లోని కొనుగోలు సెంటర్లను ఎస్పీ సందర్శించారు. కొనుగోళ్ల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. సెంటర్లలో సమస్యలపై రైతులను ఆరా తీశారు.

అనంతరం ఎస్పీ మాట్లాడుతూ రైతుల సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరానికి కృషి చేస్తామన్నారు. రైతులు కష్టపడి పండించిన వడ్లు కొనుగోలు సెంటర్లలో అమ్మి మద్దతు ధర పొందాలని సూచించారు. ఆయన వెంట డీఎస్పీ చంద్రశేఖర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, సీఐ శ్రీనివాస్, సిబ్బంది ఉన్నారు.

 విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు 

కోనరావుపేట, వెలుగు : విద్యతోనే ఉజ్వల భవిష్యత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సాధ్యమని, ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో ప్రణాళికతో కష్టపడి చదవాలని ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. బాలల దినోత్సవం సందర్భంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కోనరావుపేట మండల కేంద్రంలోని మోడల్ స్కూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విద్యార్థులకు చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు.

ఈ సందర్భంగా  ఆయన మాట్లాడుతూ విద్యార్థినులు పోకిరీల పట్ల జాగ్రత్తగా ఉండాలని, ఎవరైనా వేధింపులకు గురిచేస్తే జిల్లా షీ టీం నెంబర్ 8712656425 కు ఫిర్యాదు చేయాలన్నారు. ఆయన వెంట సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై ప్రశాంత్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.