గ్రామాల్లో విజిబుల్ పోలీసింగ్ అమలు చేయాలి : అఖిల్ మహాజన్

బోయినిపల్లి/వేములవాడ రూరల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: గ్రామాల్లో నేరాల నియంత్రణకు విజిబుల్ పోలిసింగ్ అమలు చేయాలని రాజన్న సిరిసిల్ల ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా బుధవారం బోయినిపల్లి, వేములవాడ రూరల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోలీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టేషన్లను సందర్శించారు. ఈ సందర్భంగా స్టేషన్ పరిసరాలు, రికార్డ్స్, వర్టికల్స్ అమలు, స్టేషన్ లో సిబ్బంది కిట్ ఆర్టికల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. తదితరాలను పరిశీలించారు. 

అనంతరం స్టేషన్ పరిధిలో నమోదవుతున్న కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఫిర్యాదుల విషయంలో వెంటనే స్పందించాలని, విచారణ చేసి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. విలేజ్ పోలీస్ అధికారులు తమకు కేటాయించిన గ్రామాల్లో ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉండాలన్నారు. డయల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌100కి రాగానే బ్లూ కోల్ట్స్ సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని సమస్య తెలుసుకోవాలన్నారు. ఆయన వెంట ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి, సీఐ శ్రీనివాస్, ఎస్ఐలు పృథ్వీందర్ గౌడ్, మారుతి, సిబ్బంది ఉన్నారు.