ఇంటి ఖర్చుల్లో దక్షిణాది రాష్ట్రాలు టాప్..తెలంగాణ 3వ స్థానం: పెరిగిన ధరలతో మారిన అభిరుచులు ఇలా..

ఇంటి ఖర్చు.. అంటే నిత్యావసరాలు. పప్పులు, ఉప్పులు, ఆయిల్స్, బియ్యం, కూరగాయలు, మాంసం, ఫ్రూట్స్, ఎగ్స్, మసాలాలు, పానీయాలు.. ఓవరాల్ గా ఇంట్లో ఓ కుటుంబం బతకటం కోసం తినటానికి చేసే ఖర్చులు అన్న మాట.. వీటి ఖర్చు అనేది గణనీయంగా పెరిగినట్లు సర్వే స్పష్టం చేస్తోంది. 

దేశవ్యాప్తంగా దక్షిణాది రాష్ట్రాలు టాప్ లో ఉన్నాయి. నెలవారీ ఇంటి ఖర్చులు.. తలసరి వినియోగ వ్యయంలో సౌత్ స్టేట్స్ ముందంజలో ఉన్నాయి. గృహ వినియోగ వ్యయ సర్వే 2023.. 24 మధ్య ఏయే రాష్ట్రాల్లో ఎంతెంత ఖర్చు అవుతున్నది అనేది ఈ సర్వే స్పష్టం చేసింది. 

Also Read :- ఎప్పుడేం మాట్లాడాలో తెలియదా అంటూ ఫ్యాన్స్ పై ఫైర్

2023 ఆగస్ట్ నుంచి.. 2024 జూలై మధ్య.. దేశ వ్యాప్తంగా 2 లక్షల 61 వేల 953 మందిని సర్వే చేయగా.. ఇందులో గ్రామీణ ప్రాంతాల్లో లక్షా 54 వేల 357 మందిని.. పట్టణ ప్రాంతాల్లో లక్షా 7 వేల 596 మంది నుంచి ఈ వివరాలు సేకరించింది ఈ సర్వే సంస్థ.

 నెలవారీ గృహ వినియోగ వ్యయంలో కేరళ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది.

  • కేరళ రాష్ట్రంలో గ్రామీణ కుటుంబాలు నెలకు 6 వేల 611 రూపాయలు ఖర్చు చేస్తుండగా.. పట్టణ కుటుంబాలు 7 వేల 834 రూపాయలు ఖర్చు చేస్తున్నాయి.
  • తమిళనాడు గ్రామీణ ప్రాంతాల్లో నెలకు 5వేల 872  రూపాయలు ఖర్చు చేస్తుండగా.. పట్టణ ప్రాంతాల్లో 8వేల 325 రూపాయలు ఖర్చు చేస్తున్నారు.  
  • ఇక నెలవారి గృహవినియోగ వ్యయంలో తెలంగాణ మూడో స్థానంలో ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో 5వేల675 రూపాయలు ఖర్చు చేస్తుండగా.. పట్టణ ప్రాంతాల్లో 9వేల131 రూపాయలు ఖర్చు చేస్తున్నారు.  
  • ఆంధ్రప్రదేశ్ లో గ్రామీణ కుటుంబాలు 6వేల107 రూపాయలు, పట్టణ గృహాలు 9వేల877 రూపాయలు ఖర్చు చేస్తున్నాయి. 
  • కర్ణాటక గ్రామీణ ప్రాంతాల్లో 5వేల068 రూపాయలు , అర్బన్ జోన్లలో 8వేల 169రూపాయలతో  కర్ణాటక ఐదు స్థానంలో  నిలిచింది.

ఇదంతా  నెలవారి గృహవినియోగ వ్యయంలో జాతీయ సగటుతో పోల్చినపుడు ఈ రాష్ట్రాలు వరుసగా మూడు స్థానాల్లో ఉన్నాయి. జాతీయ సగటు నెలవారి గృహ వినియోగ వ్యయం గ్రామీణ ప్రాంతాల్లో 4వేల122 రూపాయలు ఉండగా.. పట్టణ ప్రాంతాల్లో 6వేల 996రూపాయలు ఖర్చు చేస్తున్నారు.