South Korean President: సౌత్ కొరియా అధ్యక్షుడిపై అభిశంసన వేటు..

సౌత్ కొరియా అధ్యక్షుడిపై అభిశంసన వేటు పడింది. మొదటి సారి సొంత పార్టీ సభ్యుల గైర్హాజరుతో పదవీ గండం తప్పించుకున్నా..ఈ సారి తప్పించుకోలేక పోయారు..మొత్తం 204 మంది సభ్యుల మద్దతుతో అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ ను పదవినుంచి తొలగిస్తూ సౌత్ కొరియా జాతీయ అసెంబ్లీ శనివారం (డిసెంబర్ 14) అభిశంసన ఓటు వేసింది. 

యున్ అభిశంసనకు జాతీయ అసెంబ్లీలో మూడింట రెండొంతుల మంది లేదా 300 మంది సభ్యుల్లో 200 మంది మద్దతు అవసరం. అభిశంసన తీర్మానాన్ని తీసు కొచ్చిన ప్రతిపక్ష పార్టీలకు చెందిన 192 సీట్లు ఉండగా..పీపీపీకి చెందిన ముగ్గురు శాసన సభ్యులు ఉన్నారు.. వీరితో పాటు యూన్ సొంత పార్టీ నేతలు కూడా ఓట్లు వేయడంతో  ఓట్ల సంఖ్య 204 దాటింది. దీంతో యూన్ అభిశంసన తీర్మానం ఆమోదించబడింది. 

యూన్  తొలగింపు వార్త వినగానే జాతీయ అసంబ్లీ ముదు నిరసన కారులు సంబరాలు చేసుకున్నారు. పాటలు పాడారు.. డ్యాన్సులు చేశారు.. కొంతమంది ఆనందంతో కన్నీరు పెట్టారు. 

దేశంలో మార్షల్ లా విధించేందుకు యత్నించి వివాదంలో చిక్కుకున్న యూన్.. జాతీయ అసెంబ్లీలో మొదటి సారి అభిశంసనను తప్పించుకున్నారు. సొంత పార్టీ నేతలు అభిశంసన ఓటింగ్ కు హాజరు కాకపోవడంతో రద్దు చేశారు. 

అభిశంసన సయమలో దక్షిణ కొరియా రాజధాని సియోల్ లోని పార్లమెంట్ భవనం వెలుపల వేలాది మంది ఆందోళనకారులు గుమికూడి యూన్ ను తొలగించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. 

ALSO READ | OpenAI కాపీ రైట్స్ ప్రశ్నించిన భారతీయ యువకుడు.. అమెరికాలో అనుమానాస్పద మృతి

యూన్ పై అభిశంసన , తొలగింపుపై ప్రతి పక్ష డెమోక్రటిక్ పార్టీ సంబరాలు చేసుకుంది.. ఇది ప్రజల విజయం అని చెప్పుకొచ్చింది. యూన్ ను అధ్యక్ష పదవినుంచి సస్పెండ్ చేయడంతో ప్రధానమంత్రి హాన్ డక్ సూ తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఇక యూన్ భవిష్యత్తుపై దక్షిణ కొరియా  సుప్రీం న్యాయస్థానం నిర్ణయం తీసుకోనుంది. 180 రోజులలోపు తీర్పును వెలువరించనుంది. 

యూన్ తొలగింపు కోర్టు సమర్థిస్తే దక్షిణ కొరియా చరిత్రలో అభిశంసనకు గురైన రెండో అధ్యక్షుగా యూన్ ఉంటాడు.కాగా యూన్ పదవీచ్యుతుడైన తర్వాత 60 రోజులోపు అధ్యక్ష ఎన్నికలు జరగాల్సి ఉంది.