ఏమైంది.. నేను ఇక్కడెందుకున్న..? సౌత్ కొరియా విమాన ప్రమాద బాధితురాలి ప్రశ్న

సియోల్: సౌత్ కొరియాలోని మువాన్ ఇంటర్నేషనల్ ఎయిర్​పోర్ట్​లో జరిగిన ఘోర విమాన ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన ఇద్దరు ఫ్లైట్ అటెండెట్స్‎లో ఒకరు సోమవారం స్పృహలోకి వచ్చారు. బాధితులను 32 ఏండ్ల మహిళ లీ గా,  25 ఏండ్ల యువకుడు క్వాన్‎గా గుర్తించారు. వీరికి మోప్కో సెంట్రల్ హాస్పిటల్‎లో ట్రీట్​మెంట్ చేశారు. తలకు గాయాలై, చీలమండ ఎముకలు విరిగిని లీ ట్రీట్​మెంట్ తర్వాత సోమవారం మెలకువలోకి వచ్చారు. ‘‘ఏమైంది? నేను ఇక్కడెందుకున్న?” అని అక్కడున్న డాక్టర్లను ఆమె ప్రశ్నించారు. 

విమాన ప్రమాదంతో ఆమె తీవ్రమైన భయం, షాక్‎కు గురైందని డాక్టర్లు మీడియాకు చెప్పారు. లీ, క్వాన్ డేంజర్ నుంచి భయటపడ్డారని వారి ప్రాణాలకు ఇప్పుడేం ముప్పు లేదని తెలిపారు. కుటుంబ సభ్యుల విజ్ఞప్తి మేరకు లీ ని రాజధాని సియోల్‎లోని ఆసుపత్రికి తరలించారు. విమానం పేలిపోయిన తర్వాత ఘటనాస్థలానికి చేరుకున్న రెస్క్యూ టీమ్ గాయాలతో విమానం తోక భాగంలో గాయాలతో ఉన్న వీరిద్దరి గుర్తించి రక్షించారు. ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్న అధికారులు ఫ్లైట్ బ్లాక్ బాక్స్‌‌లను స్వాధీనం చేసుకున్నారు.