అవీ-‌‌ – ఇవీ: జపాన్​లో ఇడ్లీ, దోశ

సౌత్​ ఇండియన్​ డిషెస్​ అయిన దోశ, ఇడ్లీ, వడ చాలా పాపులర్​. ఇండియాలోనే కాదు.. ప్రపంచంలోనే అవి చాలా ఫేమస్​. మనవాళ్లయితే విదేశాలకు వెళ్లినప్పుడల్లా అక్కడ ఉన్న ఇండియన్ రెస్టారెంట్స్​ కోసం వెతుకుతారు. ముఖ్యంగా సౌత్​ ఇండియన్స్​ ఫుడ్​ విషయంలో చాలా పర్టిక్యులర్​గా ఉంటారు. కారణం రుచికరమైన ఫుడ్​ను మిస్​ అవ్వలేకపోవడమే. అలాంటి వాళ్లకోసమే ఇద్దరు విదేశీయులు మన వంటలు నేర్చుకుని మరీ వాళ్ల దేశంలో రెస్టారెంట్​ పెట్టారు.

జపాన్​లోని క్యోటో సిటీలో  ‘తడ్కా’ అనే రెస్టారెంట్​ ఉంది. దాన్ని నడిపేది జపనీయులే. ఇదెలా బయటపడిందంటే... ప్రసన్న కార్తీక్​ అనే అతను జపాన్​ వెళ్లాడు. అక్కడ సౌత్​ ఇండియన్ రెస్టారెంట్స్ కోసం వెతుకుతుంటే ఇది కనిపించిందట. ‘ఈ రెస్టారెంట్​కి వెళ్లిన నాకు ఎన్నో ఇంట్రెస్టింగ్​ విషయాలు తెలిశాయం’టూ ఎక్స్ (ట్విటర్)లో ఓ స్టోరీ పెట్టాడు.

తడ్కా రెస్టారెంట్​లో సౌత్​ ఇండియన్​ ఫుడ్స్ దొరుకుతాయి. వాటిని వండేది జపనీయులే. కానీ టేస్ట్​ మాత్రం అచ్చం ఇండియన్స్​ వండితే ఎలా ఉంటుందో అచ్చం అలానే ఉంటుంది. దాని వెనక ఉన్న రహస్యం ఏంటంటే.. ఈ రెస్టారెంట్ ఓనర్​ ప్రతి ఆరు నెలలకు ఒకసారి చెన్నయ్​ వెళ్లొస్తుంటాడు. అక్కడ కొత్త డిషెస్​ చూసి నేర్చుకుంటాడు. వాటిలో పర్ఫెక్షన్ వచ్చేంతవరకు ప్రాక్టీస్​ చేస్తాడు. పర్ఫెక్ట్​గా వచ్చింది అనుకున్నప్పుడే దాన్ని మెనూలో యాడ్ చేస్తాడు. అలా ఒక్కో రెసిపీ మెనూ చేర్చుకుంటూ వచ్చాడట తడ్కా ఓనర్. ‘ఇక్కడ దొరికే వాటిలో దోశ, ఇడ్లీ అయితే చాలా బాగున్నాయి. ఈ రెస్టారెంట్​కి ఇండియన్ కస్టమర్స్​ వచ్చేది తక్కువే. 

కానీ, జపనీయులే ఈ రుచులను ఆస్వాదించడానికి వస్తుంటారు’ అని ప్రసన్న పోస్ట్​ చేసిన స్టోరీలో చెప్పాడు. అంతేకాదు... నిజానికి జపనీయులు అన్నం చేత్తో కాకుండా చాప్​స్టిక్స్​తో తింటారు. అలాంటిది ‘తడ్కా’ రెస్టారెంట్​లో మాత్రం ఇండియన్​ స్టయిల్​లో చేత్తో తినాలట. అలా తినాలని బోర్డు పెట్టి అందులో ఫొటోలు అతికించి, ఎలా తినాలో కింద రాశారు. అలా వీళ్లు నిజమైన ఇండియన్​ స్టయిల్​ని ప్రమోట్ చేస్తున్నారు. ఈ ప్రాసెస్​లో ఇద్దరు ఓనర్లు ఇండియన్ కల్చర్​ని, హిందూయిజాన్ని కూడా ఇంట్రెస్ట్​తో ఉన్నారు.