కోల్‌కతాలో డాక్టర్ మౌమితపై జరిగిన హత్యాచారం- హత్య ఘటన దేశవ్యాప్తంగా పెనుదుమారాన్ని రేపుతోంది. ఈ ఘటనను నిరసిస్తూ దేశవ్యాప్తంగా మహిళలు, డాక్టర్లు చేపట్టిన ఆందోళనలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. మహిళలకు భద్రత కల్పించడంతో పాటు ఈ కేసులో నిందితుడైన సంజయ్ రాయ్‌ని ఉరి తీయాలని డిమాండ్ చేస్తున్నారు. తాజాగా, బుధవారం జరిగే నిరసన ర్యాలీలో తానూ పాల్గొంటానని భారత క్రికెటర్ సౌరవ్ గంగూలీ స్పష్టం చేశారు.
కోల్‌కతాలో నిరసన చేస్తున్న జూనియర్ రెసిడెంట్ డాక్టర్లతో సౌరవ్ గంగూలీ తన గళాన్ని వినిపించనున్నారు. భార్య డోనా, కూతురు సనా గంగూలీతో కలిసి భారత మాజీ కెప్టెన్ నిరసనకారులకు సంఘీభావం ప్రకటించి, బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేయనున్నారు. బుధవారం రాత్రి 7.30 గంటలకు బెహలా చౌరస్తా నుంచి నిరసన ర్యాలీ ప్రారంభం కానుంది.
నిందితుడిని కఠినంగా శిక్షించాలి
అంతకుముందు గంగూలీ ఈ ఘటనపై స్పందిస్తూనిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అలా శిక్షించిన్నప్పుడే, భవిష్యత్తులో ఇంకెవరైనా ఇలాంటి దారుణానికి పాల్పడే సాహసం చేయరని గంగూలీ అన్నారు.