వేములవాడలో ఆస్తి కోసం దారుణం

సిరిసిల్ల జిల్లా : వేములవాడ పట్టణంలో పట్టపగలే ఆస్తికోసం కన్నకొడుకు దారుణానికి ఒడిగట్టాడు. ఆస్తి పంపకాల కోసం తండ్రి మామిండ్ల మల్లయ్యపై మొదటి భార్య కొడుకు రాజు కుల సంఘం నాయకులతో కలిసి పంచాయతీ పెట్టాడు. మామిండ్ల మల్లయ్య(49)  మొదటి భార్యకి రాజుతోపాటు ముగ్గురు కూతుళ్లు. ఆస్తి పంపకాల విషయంలో ఆదివారం వివాదం చోటుచేసుకుంది. అకస్మాత్తుగా  తండ్రి మామిండ్ల మల్లయ్యతోపాటు సవతి తల్లిపై రాజు దాడి చేశాడు. మల్లయ్య, ఆయన రెండో భార్యపై కొడుకు రాజు కుమార్, అల్లుడు, బంధువులు దాడి చేశారు. ఈ దాడిలో మామిండ్ల మల్లయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. రెండవ భార్య పద్మ పరిస్థితి విషమంగా ఉంది. ఆమెను కరీంనగర్ హాస్పిటల్ కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నారు. 

ALSO READ | కోరుట్ల తహశీల్దార్ కార్యాలయంలో చోరి