కన్నతల్లిని స్మశానంలో వదిలేసిన కొడుకులు.. జగిత్యాలలో దారుణం

జగిత్యాల జిల్లా: జన్మనిచ్చిన కన్నతల్లిని స్మశానంలో వదిలేసిన కొడుకుల నిర్వాకం జగిత్యాల పట్టణంలో వెలుగుచూసింది. గత ఎనిమిది రోజులుగా స్మశాన వాటికలోనే వృద్ధురాలు రాజవ్వ గడిపింది. జగిత్యాల పట్టణ మోతె స్మశాన వాటికలో వృద్ధురాలు కనిపించింది. పింఛన్ పైసల కోసం తల్లిని కుమారుడు చితకబాదాడు. 

పింఛన్ డబ్బులు ఇవ్వకపోవడంతో తాగుడుకు బానిసైన ఓ కొడుకు నెట్టి వేయడంతో వృద్ధురాలు రాజవ్వ కాలు విరిగింది. విరిగిన కాలు, అచేతన స్థితిలో రాజవ్వ స్మశానంలో బిక్కుబిక్కుమంటూ గడుపుతోంది. నలుగురు కొడుకులున్నా లాభం లేదని రాజవ్వ రోదించింది.

ALSO READ | ఇలాంటి భోజనం మీ పిల్లలకు పెడతారా : ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి

సంక్షేమశాఖ అధికారులకు సమాచారం ఇవ్వగా ఆమెను ఆస్పత్రికి తరలించారు. వయోవృద్ధుల చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని సంక్షేమ శాఖ అధికారి నరేష్ తెలిపారు.