పటాకులకు 2 వేల ఏండ్ల చరిత్ర.. మొదట కాల్చింది వాళ్లే..!

దీపావళి అనగానే అందరికీ గుర్తొచ్చేది పటాకులు. పటాకులు మొదలు కాల్చింది చైనీయులు. సుమారు వెయ్యేండ్ల క్రితం చైనాలోని హునాన్ ప్రాంతంలో లీ యస్ అనే సాధువు ఉండేవాడు. ఆయనే కొన్ని రసాయనాలతో విచిత్రంగా మండే టపాసుల్ని కాల్చాడని చెబుతారు. వాటిని కనిపెట్టిన ఆయనకు గుడి కూడా కట్టారు. ప్రతి ఏటా ఏప్రిల్ 18న ఆ సాధువు గుడి వద్ద పూజలు చేసి పటాకులు కాల్చుతారు. మరో కథ కూడా ప్రచారంలో ఉంది. 2000 ఏళ్ల క్రితం చైనాలో ఓ వంటవాడు. అనుకోకుండా వీటిని కనిపెట్టాడు. ఓరోజు అతడు మూడు రకాల పొడులను బాణాలిపై వేడి చేస్తున్నప్పుడు నిప్పురవ్వ పడి ఆ మిశ్రమం పెద్దగా మెరుపులు చిమ్ముతూ మండిపోయింది. ఆ మూడు మిశ్రమాలను ఓ వెదురు బొంగులో వేసి కాల్చితే 'ఢాం' అనే శబ్ధం వచ్చిందని చెబుతారు. పటాకులు కాల్చితే భూతాలు, పిశాచాలు 
పారిపోతాయని నమ్ముతారు.

1923 నుంచి మనదేశంలో పటాకులు

సత్యభామ నరకాసురుడిని అంతమొందించిన రోజు, రావణుడిని సంహరించిన రాముడు సాకేత పురికి సీతాలక్ష్మణ సమేతంగా చేరుకున్న రోజు దీపావళి. ఈ ఆనంద సమయాన్ని తొలినాళ్లలో భారతీయులు కేవలం దీపాలు వెలిగించి జరుపుకొనేవారు. 1923కు ముందు మన దేశంలో అసలు పటాకులే లేవు. వాటిని మనకు పరిచయం చేసింది తమిళనాడుకు చెందిన నాడర్ బ్రదర్స్. వకాశీ పట్టణానికి చెందిన పీ అయ్యన్ నాడర్, షణ్ముగ నాడర్ అనే అన్నదమ్ములు కలకత్తా వెళ్లి అక్కడ ఓ అగ్గిపెట్టెలు తయారు చేసే ఫ్యాక్టరీలో పనిచేసేవారు. అగ్గిపుల్లల తయారీకి వినియోగించే రసాయనా లతో పటాకులు తయారు చేయడం నేర్చుకున్నారు. తర్వాత శివకాశీకి చేరుకొని మొదట అగ్గిపెట్టెలు తయారీని ప్రారంభించారు. తర్వాత జర్మనీ నుంచి యంత్రాలను దిగుమతి చేసుకొని అనిల్ బ్రాండ్, అయ్యస్ బ్రాండ్ పేరుతో పటాకుల తయారీని ప్రారంభించారు. ఇప్పుడు శివకాశీలో 8వేలకు పైగా పటాకుల ఫ్యాక్టరీలున్నాయి.

ALSO READ : ఈ దివాళికి ఐదు బెస్ట్ గిఫ్ట్స్ : రూ.10వేలలోపే.. ట్రై చేయండి

అవార్డులిచ్చిన ఎలిజబెత్ రాణి

పటాకులంటే ఇంగ్లండ్ రాణి ఎలిజబెత్ కు ఎంతో ఇష్టం. మా ర్కపోలో సముద్రయానం చేస్తూ వాటిని చైనా నుంచి ఇంగ్లండ్ తీసుకెళ్లాడట. ఎలిజబెత్ రాణికి పటాకులు చాలా నచ్చాయట. ఇందుకోసం ప్రత్యేకంగా ఆమె ప్రదర్శన ఏర్పాటు చేసి పటాలకు కాల్చిన వారికి అవార్డులు ఇచ్చే వారని తెలుస్తోంది.