Women Beauty : మేకప్ ముందు, తర్వాత ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..!

మేకప్ వేసుకునే ముందు, తీసేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే ముఖంపై మొటిమలు, మచ్చలు, ముడతలు లాంటి సమస్యలకు దారితీస్తాయి. అలాంటి సమస్యలకు చెక్ పెట్టాలంటే కాస్త కేర్ ఫుల్ గా ఉండాలి.

బోలెడంత డబ్బు పోసి కొన్నాం కాబట్టి అయిపోయేవరకు మేకప్ వస్తువులను వాడాలి అనుకోవద్దు. మస్కారా, కాటుక లాంటివి ఆరునెలలే వాడాలి. అంతకు మించి వాడకూడదు. అలాగే ఎంత రాత్రి అయినా సరే మేకప్ ను  తొలగించుకోవాల్సిందే. లేకపోతే. ముఖం మీద మొటిమలు, మచ్చలు వస్తాయి.

 కళ్లు ఎర్రగా ఉంటే కంట్లో ఏదో పడి ఉంటుంది. అనుకుంటారు. శుభ్రం చేసుకుని వదిలేస్తారు. కానీ అన్నిసార్లు దుమ్ము ఇందుకు కారణం కాదు. కళ్ల అలంకరణకు ఉపయోగించే బ్రష్ ను శుభ్రం చేసుకోకపోవడం వల్ల కూడా కంటి సమస్యలు వస్తాయి. అందుకే వారానికి ఒకసారైనా షాంపూ, గోరువెచ్చని నీళ్లతో కంటి మేకపి వాడే బ్రష్లను శుభ్రం చేసుకోవాలి. లేకపోతే కళ్లలో దురద, ఇన్ ఫెక్షన్లు వస్తాయి. 

Also Read:జ్వరం వచ్చినప్పుడు అన్నం తినాలా వద్దా..?

ఉదయం లేచిన దగ్గర్నుంచి చేతులతో ఎన్నో పనులు చేస్తుంటారు. శుభ్రం చేసుకోకుండా ఆ చేతులతోనే మేకప్ వేసుకుంటారు. కొందరు. దానివల్ల చేతులపై ఉన్న క్రిములు ముఖం పై చేరి చర్మరంధ్రాలను మూసేస్తాయి. దాంతో మొటిమలు వస్తాయి. అందుకే మేకప్ వేసుకునే ముందు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. అలాగే మేకప్ కు  ముందు ముఖాన్ని ఐసు ముక్కలతో కాసేపు రుద్దాలి. తరువాత మెత్తని వస్త్రంతో శుభ్రంగా తుడవాలి. ఇలా చేయడం వల్ల చర్మానికి తేమ అందుతుంది. ఎలాంటి చర్మ సమస్యలు దరిచేరవు.

చాలామంది ఐ బ్రో చేసుకునే తీరిక లేక కనుబొమల్ని ప్రక్కర్స్ తో లాగుతుంటారు.ఒకవేళ కనుబొమలు పలుచగా ఉంటే ప్రక్కర్స్ ని ఉపయోగించి షేప్ చేస్తే అవి మరీ పలుచగా కనిపిస్తాయి. దాంతో వయసు పైబడినట్టు కనిపిస్తుంది. అందువల్ల ఇలాంటి ప్రయోగాలకు దూరంగా ఉండాలి. ఐబ్రో చేసుకునే సమయం లేకపోతే బజ్రా జెల్ రాసుకోవాలి. దానివల్ల కనుబొమలు దట్టంగా ఒక ఆకృతిలో కనిపిస్తాయి.

మేకప్ కి ముందు

ఫౌండేషన్  :  మేకప్ వేసుకోవడానికి ముందు నాణ్యమైన జైన్సర్ తో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. బేసిక్ క్రీం, మాయిశ్చరైజర్ రాసుకున్న తరువాత ఫౌండేషన్ వేసుకోవాలి. వీలైతే కాసేపు మర్దన చేసిన తర్వాత ఫౌండేషన్ రాయాలి. వీలైనంత వరకు లిక్విడ్, మాయిశ్చరైజర్ ఫౌండేషన్స్ ఎంచుకోవాలి. చాలామంది ఫౌండేషన్ ముఖానికి చక్కగా రాసుకుంటారు. అయితే చెవులు, మెడకు ఏదో మొక్కుబడిగా వేసుకుంటారు. కానీ ముఖానికి ఎలాగైతే జాగ్రత్తగా వేసుకున్నారో అలానే ఆ భాగాల్లో కూడా ఫౌండేషన్ రాసుకోవాలి. అప్పుడే చూర్ణానికి అందంగా కనిపిస్తారు.

సన్ స్క్రీన్ లోషన్ :  మేకప్ వేసుకునే ముందు తప్పని సరిగా సన్ స్క్రీన్ లోషన్ రాసుకోవాలి. అంటే కనీసం గంట ముందు ససీ స్క్రీన్ లోషన్ వాడాలన్నమాట. సన్ స్క్రీన్ వాడాలనుకునే వారు ఫౌండేషన్ క్రీంతో కలిపి రాసుకోవాలి. జిడ్డు చర్మం వాళ్లు మేకప్ వేసుకోవడానికి గంట ముందు సన్ స్క్రీన్ లోషన్ రాసుకుంటే మంచిది.

జిడ్డు చర్మం :  కొందరి చర్మం బాగా జిడ్డుగా ఉంటుంది. అలాంటి వారు ఆయిల్ ఫ్రీ ప్రై మరిన్ని రాసుకోవాలి. దీనిలో ఫేస్ ప్రైమర్, ఐ ప్రైమర్ అని విడివిడిగా ఉంటాయి. దేనికి దాన్నే వాడాలి.

బ్రాంజర్స్  :  వీటిని చాలా జాగ్రత్తగా ఎంచుకోవాలి. లిక్విడ్, క్రీం బ్రాంజరి కి దూరంగా ఉండాలి. ఇవి ముఖాన్ని జిడ్డుగా కనిపించేలా చేస్తాయి. వాటికి బదులు మ్యాటీ రకాలను ఎంచుకోవచ్చు.

 కళ్లకు మ్యాటీ పౌడర్ :  కళ్లకు ప్రైమర్ వేసాక కాస్త జిడ్డుగా అనిపిస్తుంటే మ్యాటీ పౌడర్ అద్దాలి. ఇలా చేయడం వల్ల మేకప్ తాజాగా కనిపిస్తుంది. వాటర్ ప్రూప్ ఐ-ట్రైనర్, షాడో, మస్కారా, అండర్ ఐ-కన్సీలర్లు వాడటం మంచిది.

మేకప్ కేర్  ఇలా తీసేసుకోండి

చాలామంది. మేకపిని తొలగించుకోవడానికి రిమూవింగ్ క్రీమ్స్ ని ఆశ్రయిస్తుంటారు. కానీ వాటిల్లోని కెమికల్స్ చర్మానికి హాని కలిగిస్తాయి. అందుకే సహజ పద్ధతిలో మేకపిని తొలగించుకోవడానికి ప్రయత్నించాలి. అది ఎలా అంటారా?

౦ పావు కప్పు పెరుగులో రెండు చుక్కల ఆలివ్ నూనెను కలపాలి. ఆ మిశ్రమంలో దూది ముంచి మేకప్ని తుడిచేయొచ్చు. చర్మంపై పేరుకున్న మురికిని పెరుగు తొలగిస్తుంది. ఆలివ్ నూనె చర్మాన్ని మృదువుగా మారుస్తుంది.
౦ తేనెలో కొద్దిగా వంటసోడా వేసి ముఖాన్ని తుడిచినా మేకప్ పోతుంది. అంతేకాదు చర్మం తేమగా, తాజాగా కనిపిస్తుంది. అలాగే కీరదోస ముక్కలను పాలు, ఆలివ్ నూనెలతో కలిపి... ముఖానికి రాసి గోరువెచ్చని నీళ్లతో కడిగితే మేకప్ పోతుంది.
౦ కొబ్బరి నూనెను ముఖానికి రాసుకుని మసాజ్ చేసుకోవాలి. కొద్ది సేపటి తర్వాత గోరు వెచ్చని నీళ్లతో ముఖం కడుక్కోవాలి. తర్వాత తడిబట్టతో ముఖాన్ని తుడిస్తే మేకప్ పూర్తిగా తొలగిపోతుంది.