ఛార్జర్ టైమర్
చాలామంది ఫోన్‌కి ఛార్జింగ్ పెట్టి మర్చిపోయి పడుకుంటారు. కొందరైతే టీవీ కూడా ఆఫ్ చేయకుండానే నిద్రలోకి జారుకుంటారు. అలాంటివాళ్లకు ఇది బెస్ట్ గాడ్జెట్. ఈ టైమర్ సాకెట్‌కి కౌంట్‌డౌన్ టైమర్ ఉంటుంది. అందులో సెట్ చేసిన టైంకి ఆటోమెటిక్‌గా పవర్ ఆఫ్ అవుతుంది. దీనివల్ల చాలావరకు కరెంట్ ఆదా అవుతుంది. ఇందులో చాలా టైం స్లాట్‌లు ఉంటాయి. టైమర్‌ని10 నిమిషాల నుండి 9 గంటల వరకు సెట్ చేసుకోవచ్చు. దీన్ని బ్లాక్ట్ ఎలక్ట్రానిక్స్ మార్కెట్‌లోకి తీసుకొచ్చింది.
ధర : 569 రూపాయలు
మినీ వ్యాక్యూమ్ క్లీనర్
ఇంట్లో చెత్త ఉంటే వ్యాక్యూమ్ క్లీనర్‌తోనో, చీపురుతోనో క్లీన్ చేస్తాం. కానీ.. ల్యాప్‌టాప్‌లు, చిన్న చిన్న గాడ్జెట్లలో సందుల్లో చెత్త పేరుకుపోతే పరిస్థితి ఏంటి? అందుకోసం ప్రత్యేకంగా పోర్టబుల్ వ్యాక్యూమ్ అందుబాటులోకి వచ్చింది. దీన్ని రీమాక్స్ అనే కంపెనీ తయారుచేస్తోంది. డెస్క్‌టాప్‌లు, ల్యాప్‌టాప్‌లు, కీబోర్డుల్లో పడిన సిగరెట్ యాష్, బ్రెడ్‌క్రంబ్స్, పేపర్ స్క్రాప్, పెంపుడు జంతువుల వెంట్రుకలు లాంటివి ఉంటే క్లీన్ చేస్తుంది. దీని సైజు కూడా చాలా చిన్నగా ఉంటుంది. కాబట్టి ఎక్కడికైనా ఈజీగా తీసుకెళ్లొచ్చు. ఇందులో శక్తివంతమైన హై-స్పీడ్ సెంట్రిఫ్యూజల్ ఫ్యాన్ ఉంటుంది. రెండు AA బ్యాటరీలు వేస్తే వాడుకోవచ్చు. ఈ వాక్యూమ్ క్లీనర్‌లోని మోటార్ 12,000 ఆర్పీఎం వేగంతో తిరుగుతుంది.
ధర : 557 రూపాయలు
టీవీ కీబోర్డ్
ఫోన్‌లో, కంప్యూటర్‌లో టైపింగ్ చేయడం అంత కష్టమేమీ కాదు. కానీ.. టీవీలోని బ్రౌజర్‌లో లేదంటే యూట్యూబ్ లాంటి స్ట్రీమింగ్ యాప్‌లో టైప్ చేయాలంటే చిరాకు పుడుతుంది. ఎందుకంటే.. వాటి రిమోట్లలో కీబోర్డ్ ఉండదు. ప్రతి లెటర్ మీదకు పాయింటర్‌ని తీసుకెళ్లి క్లిక్ చేయాలి. అందుకు చాలా టైం పడుతుంది. అలాంటప్పుడు రెడిన్‌గ్రే రిమోట్ వాడాలి. ఇది రిమోట్ మాత్రమే కాదు. కీబోర్డ్‌లా కూడా పనిచేస్తుంది. ఇది మల్టీ టచ్ ప్యాడ్, ఫ్లై ఎయిర్ మౌస్‌లా పనిచేస్తుంది. దీనికి 2.4GHz వైర్‌లెస్ రిసీవర్ ఉంటుంది. దాన్ని డివైజ్‌కి ప్లగ్ చేసి వాడుకోవాలి. ఎనిమిది నుండి 10 మీటర్ల దూరం వరకు పనిచేస్తుంది. ఇది స్మార్ట్ టీవీలకే కాదు.. కంప్యూటర్, టాబ్లెట్ ప్రొజెక్టర్లు, గూగుల్ టీవీకి కూడా సపోర్ట్ చేస్తుంది. విండోస్, మ్యాక్, ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్స్‌కి కనెక్ట్ చేసుకోవచ్చు.
ధర: 1,499 రూపాయలు
ఎక్స్‌ట్రా సిమ్ స్లాట్
ఇప్పుడు వస్తున్న ఫోన్లలో కంపెనీలు ఎక్కువగా హైబ్రిడ్ స్లాట్స్ ఇస్తున్నాయి. ఈ స్లాట్లలో రెండు సిమ్ కార్డ్‌లు వేసుకోవచ్చు. లేదంటే ఒక సిమ్ కార్డ్‌తో పాటు ఎస్డీ కార్డ్ వేసుకునే అవకాశం ఉంది. కానీ.. రెండు సిమ్ కార్డ్‌లతో పాటు ఎస్డీ కార్డ్ వేసుకోవడం కుదరదు. అలాంటప్పుడు ఈ సిమ్ స్లాట్ అడాప్టర్ వాడితే సరిపోతుంది. కాకపోతే.. ఇది కొన్ని ఫోన్లకు పెట్టుకోవడం సాధ్యం కాదు. ఈ స్ట్రిప్‌ని సిమ్ స్లాట్‌లో పెట్టి, దానిపై నుంచి మైక్రో ఎస్డీ కార్డ్ పెట్టాలి. తర్వాత ఈ స్ట్రిప్‌ని బయటకు పెట్టి ట్రే క్లోజ్ చేయాలి. స్ట్రిప్‌కి కనెక్ట్ చేసి ఉన్న సిమ్ స్లాట్‌లో మరో సిమ్ పెట్టుకోవచ్చు. ఆ ఎడాప్టర్‌ని ఫోన్‌కి వెనుక భాగంలో పెట్టి, బ్యాక్ కేస్ తగిలిస్తే సరిపోతుంది. కాకపోతే.. ఇవి తొందరగా పాడయ్యే అవకాశం ఉంది. దీన్ని ఎనానిమస్ అనే కంపెనీ మార్కెట్‌లోకి తీసుకొచ్చింది.
జత స్లాట్ల ధర : 249 రూపాయలు