డిసెంబర్ 31, న్యూ ఇయర్ వేడుకలను కేరళలో ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా.. కొచ్చి ప్రకృతి అందాలను ఆశ్వాదించాలనుకుంటున్నారా..మీ బడ్జెట్ లో బోట్ సౌకర్యంతో ప్రయాణించి కొచ్చి ఐస్ లాండ్స్ బ్యాక్ వాటర్ అందాలను మీ కెమెరాల్లో బంధించాలనుకుంటున్నారా.. అటువంటి టూరిస్టులకోసం కేరళ ప్రభుత్వం న్యూఇయర్ కానుకగా ప్రత్యేక బోట్ సర్వీస్ ను ప్రారంభిం చింది. ఇంద్ర డబుల్ డెక్కర్ కాటమరాన్ బోట్ ను ప్రారంభించింది కేరళ రాష్ట్ర జలరవాణశాఖ.
కొత్త సంవత్సరంలో కేరళకు వెళ్లి ఎంజాయ్ చేయాలనుకునే పర్యాటకులకోసం సోలార్ ఏసీ బోట్ సర్వీస్ ను ప్రారంచింది. ఇంద్ర అని పిలువబడే ఈ డబుల్ డెక్కర్ కాటమరాన్ పడవ కేవలం పర్యాటకుల ప్రయోజనాలకోసం ఉపయోగించనున్నారు. ఇప్పటికే ఇంద్ర ట్రయల్ రన్ పూర్తి అయింది. డిసెంబర్ 31 లోపు ఈ సర్వీస్ ను ప్రారంభించాలనా రాష్ట్ర జలరావాణా శాఖ ప్లాన్ చేసుకుంటున్నట్లు డైరెక్టర్ షాజీ వి నాయర్ చెప్పారు.
ఇంద్ర డబుల్ డెక్కర్ బోట్ ఇండియాలో తొలి అతిపెద్ద సౌరశక్తితో నడిచే ఫెర్రీ.. ఈ బోట్ సర్వీస్ ఎర్నాకులం జెట్టీ, వైపీన్, బొల్గట్టి, ఫోర్ట్ కొచ్చి, మట్టన్ చేరి, విల్లింగ్ డన్ ఐస్ లాండ్ లను కలుపుతుంది., ప్రధానంగా కొచ్చికి వచ్చే పర్యాటకులకు ఇందులో భోజనం సౌకర్యం కూడా కల్పిస్తున్నారు.
కొచ్చిలో బ్యాక్ వాటర్ అందాలను అస్వాదించాలనుకుంటే ఈ బోట్ ద్వారా మూడు గంటల ప్రయాణం చేయాలి. ఇందుకు టూరిస్టులు రూ. 300 చెల్లించాల్సి ఉంటుంది. మెరైన్ డ్రైవ్ నుంచి నడిచే ప్రైవటే్ టూరిస్ట్ బోట్ లు బ్యాక్ వాటర్స్ లో గంట సేపు ప్రయాణించడానికి రూ. 300 చెల్లించాల్సి ఉంటుంది.
ఇంద్ర డబుల్ డెక్కర్ బోట్ లో 100 మంది ప్రయాణించేందుకు సౌకర్యం ఉంది. ఇంద్రలో ప్రీమియం ఫెసిలిటీ, భద్రతా ఫీచర్లు, ఆకర్షణీయమైన ఇంటీరియర్స్ ఉంటాయి. రెండు 20 kwN ఎలక్ట్రిక్ మోటార్లతో నడిచే ఈ పడవ ఏడు నాట్ల గరిష్ట వేగాన్ని అందుకోగలదు.