Solar Paint: గ్రౌండ్ బ్రేకింగ్ టెక్నాలజీ..EVల ఛార్జింగ్ కోసం..ఎప్పుడైనా..ఎక్కడైనా ఛార్జ్ చేయొచ్చు

మీరు ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడుతున్నారా? రోజూ ఇంట్లోగానీ, ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్లలో గానీ  వెహికల్స్ ఛార్జ్ చేస్తారు కదా.. ఇకపై మీకు ఆ బాధ ఉండదు. ఎందుకంటే ఇప్పుడు సౌరశక్తి తో మీరు మీ వెహికల్స్ ను ఛార్జ్ చేసుకోవచ్చు. ఓ టెక్నాలజీ వచ్చేస్తోంది.. ఇప్పటికే సోలార్ ప్యానెల్స్ ఉన్నాయి.. అయితే వీటికంటే మరింత శక్తివంతమైనవి.. ఈ టెక్నాలజీతో పార్కింగ్ ఉన్నా.. డ్రైవింగ్ లో ఉన్నా ఛార్జింగ్ చేసుకోవచ్చు.. ఏంటా టెక్నాలజీ.. ఎలా పనిచేస్తుంది. ఎంత దూరం ప్రయాణించవచ్చు.. వంటి విషయాలను తెలుసుందాం.. 

ప్రముఖ కార్ల తయారీ సంస్థ.. మెర్సిడెజ్ బెంజ్.. గ్రౌండ్ బ్రేకింగ్ టెక్నాలజీతో వస్తుంది..ఎలక్ట్రిక్ వెహికల్స్ (EVs) కోసం అడ్వాన్స్ డ్ టెక్నాలజీతో ‘‘సోలార్ పెయింట్ ’’ను తయారు చేస్తుంది. సోలార్ పెయింట్ కారువేయడం ద్వారా అన్ని వేళలా ఛార్జింగ్ చేసుకోవచ్చు. పార్కింగ్ చేసినా.. రన్నింగ్ లో ఉన్నా కూడా ఛార్జ్ అవుతుంది. సోలార్ పెయింట్ వేస్తే.. ఇంట్లో గంటలగంటలు ఛార్జింగ్ పెట్టాల్సిన పనిలేదు.. ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్ల వద్ద పడిగాపులు కాయాల్సిన అవసరం ఉండదు. 

 మెర్సిడెజ్ బెంజ్ కంపెనీ  ఎలక్ట్రిక్ వెహికల్స్  (EVs)  సోలార్ పెయింట్ వేసి ఛార్జ్ చేసుకునే టెక్నాలజీని అభివృద్ది చేస్తోంది. ఇది పార్కింగ చేసినా.. లేదా డ్రైవింగ్ లో ఉన్న.. వెహికల్స్ బయటిభాగాలను ప్రతి అంగుళం నుంచి ఛార్జ్ చేసుకునే యంత్రంగా మారుస్తుంది. 

ALSO READ | ఈ యాప్‌లు ఇన్‌స్టాల్ చేశారేమో చూసుకోండి.. 18 OTT యాప్‌లపై నిషేధం

సోలార్ పెయింట్ ఓ సన్నని, ఫ్లిక్సిబుల్ ఫొటోవోల్గాక్(కాంతి విపీడన పదార్థం) తో తయారు చేయబడుతుంది. ఇది చ. మీటరకు 50 గ్రాముల బరువు, 5 మైక్రోమీటర్ల మందంతో ఉంటుంది. ఈ సోలార్ పెయింట్ తో ఏడాదిలో 7వేల456 మైళ్ల వరకు ప్రయాణించే ఎనర్జీని పొందగలని మెర్సిడెజ్ బెంజ్ కంపెనీ అంచనా వేస్తోంది.

ఈ సోలార్ పెయింట్.. ఇప్పుడున్న సోలార్ ప్యానెల్ వలె గాజు పలకలతో కాకుండా..ఎక్కువ రూఫ్ ను, కారు అన్ని భాగాల్లో పెయింట్ వేయొచ్చు. ఇది కారుకు రంగు వేసినట్లుగానే వేస్తారు. ఇది సౌరశక్తికి వెంటనే స్పందిస్తుంది. ఈ పెయింట్ ను పొరలుపొరలుగా  వేయొచ్చు. ఇన్సులేషన్, బటర్ ఫ్లై రెక్కను పోలి పొర ఉంటుంది. సూర్యకాంతని శోషణం చేసుకునేందుకు వివిధ రకాల రంగుల్లో ఉండనుంది. సేకరించిన EV శక్తిని డైరెక్టుగా బ్యాటరీకి పంపుతుంది. పెద్ద పెద్ద కొండల్లో రోజు మొత్తం ప్రయాణించాలంటే సోలార్ పెయింట్ ఛార్జీంగ్ కవర్ చేస్తుంది. 

సోలార్ పెయింట్ లో సోలార్ ప్యానెల్ లలో ఉపయోగించి ఎర్త్ లోహాలు లేదా విష పదార్థాలు వినియోగించబడవు. పర్యావరణ పరిరక్షణకు అనుకూలమై, రీసైకిల్ చేయగలిగే పదార్థాలను వాడతారు. ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఛార్జింగ్ ప్రాబ్లమ్.. దీనికి సోలార్ పెయింట్ చక్కని పరిష్కారం అంటున్నారు మెర్సిడెజ్ బెంజ్ ప్రతినిధులు. దీంతో ఛార్జింగ్ నెట్ వర్క్ లు , హోం ఇన్ స్టాలేషన్లపై ఆధారపడటాన్ని తగ్గిస్తుంది. ఈ సోలార్ పెయింట్ టెక్నాలజీ EV కస్టమర్లకు బెస్ట్ వన్.. కస్టమర్లు ఈ టెక్నాలజీని ఆదరిస్తారని మెర్సిడెజ్ బెంజ్ సంస్థ భావిస్తోంది.