గుర్తు తెలియని వాహనం ఢీకొని సాఫ్ట్వేర్ ఉద్యోగి మృతి..

జగిత్యాల జిల్లా, వెలుగు :  గుర్తుతెలియని వాహనం ఢీకొని  యువకుడు మృతి చెందిన ఘటన జగిత్యాల పట్టణం చోటుచేసుకుంది. అర్ధరాత్రి పట్టణంలోని బీట్ బజార్ చౌరస్తా వద్ద ఈ ఘటన జరిగింది. మృతుడిని అదే ఏరియాకు చెందిన పల్లె యశ్వంత్ గా గుర్తించారు.  

సాఫ్ట్ వేర్ (వర్క్ ఫ్రం హోమ్) ఉద్యోగం చేస్తున్న  యశ్వంత్ మృతితో పట్టణంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వివరాలు తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.