కాంగ్రెస్​లో చేరిన సొసైటీ చైర్మన్, డైరెక్టర్లు

ధర్పల్లి, వెలుగు: ధర్పల్లి సింగిల్​విండో చైర్మన్​ మల్లికార్జున్, ఆరుగురు సొసైటీ డైరెక్టర్లు బీఆర్ఎస్​ పార్టీని వీడి కాంగ్రెస్​ పార్టీలో గురువారం చేరారు. కాంగ్రెస్​ పార్టీ మండలాధ్యక్షుడు ఆర్మూర్​ చిన్నబాల్​రాజ్​ఆధ్వర్యంలో చైర్మన్, వైస్​ చైర్మన్​గున్నయ్య, ఆరుగురు సొసైటీ డైరెక్టర్లు కాంగ్రెస్​లో చేరడంతో రూరల్​ఎమ్మెల్యే భూపతిరెడ్డి సాదారంగా ఆహ్వానించారు. కాంగ్రెస్​ కండువాకప్పి చైర్మన్​, వైస్ చైర్మన్​, ఆరుగురు డైరెక్టర్లను ఎమ్మెల్యే పార్టీలోకి ఆహ్వానించారు.

బీఆర్ఎస్​ పార్టీలో కీలకంగా పనిచేసిన మల్లికార్జున్​, మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్​కు ప్రధాన​అనుచరుడు ఆయనతో పాటు వైస్​ చైర్మన్​, డైరెక్టర్లు కాంగ్రెస్​ పార్టీలో చేరడం గ్రామంలో చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్​ ఆరు గ్యారంటీల అమలు చేసి ప్రజాసంక్షేమంకోసం పాటు పడుతుందని ఇందుకు ఆకర్షితులై పార్టీలో చేరినట్లు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్​ పార్టీ మండలాధ్యక్షుడు ఆర్మూర్​ చిన్నబాల్​రాజ్​, జేసీబీ శ్రీనివాస్​, చెలిమెల నర్సయ్య, మిట్టపల్లి గంగారెడ్డి, తలకొక్కుల మహేందర్,​ పాల్గొన్నారు.