Video Viral: ఇదెక్కడి పిచ్చిరా ... రీల్స్ కోసం పాడుబడ్డ బావిపై బిడ్డ ప్రాణాలు

ఈ రోజుల్లో జనాలు రాత్రికి రాత్రే పాపులర్ అవ్వాలనుకుంటున్నారు.  దానికోసం పిచ్చి చేష్ఠలు,, వెర్రి చేష్ఠలు చేయడం.. సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వైరల్ అవ్వాలని కోరుకుంటున్నారు. ఆ వీడియోలు చేయడం రిస్కయినా.. ప్రాణం మీదకు వస్తాయని తెలిసినా జనాలు వెనుకాడటం లేదు.  వారి ప్రాణాలే కాదు. ఇతరుల ప్రాణాలను కూడా పణంగా పెట్టి వీడియోలు చేస్తున్నారు.  వైరల్ వ్యామోహంలో పడిన ఓ మహిళ పాపులారిటీ కోసం  చిన్నారిని అజాగ్రత్తగా పట్టుకొని పాడుబడ్డ బావిలో స్టంట్స్ చేయడం సోషల్ మీడియా రీల్ కోసం ప్రయత్నించడం కనిపించింది. .ఈ వీడియో చూసిన వారు షాక్ అయ్యారు.

ఓ తల్లి రీల్స్ మోజులో .. పాడుబడ్డబావిపై కూర్చొని .. చిన్నారిని బావిలో ఉంచి పట్టుకొని పాటలు పాడుతూ ఎంజాయి చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  ఈ వీడియోను చూసిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పందించారు.  సోషల్ మీడియా పాపులారిటీ కోసం.. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తూ.. పిల్లల ప్రాణాలను రిస్క్ పెట్టడం..ఎంతవరకు సమంజనం.. తేడా వచ్చిందా.. ఆ చిన్నారి ప్రాణాలకు ప్రమాదం వాటిల్లుతుందనే సోయి లేదు.. వెర్రి వేషాలు వేస్తూ..  ఫేమస్ కోసం సోషల్ మీడియాకు బానిసలు కాకండి.. అంటూ సజ్జనార్ వీడియో షేర్ చేశారు.