Masala Dosa: న్యూజిలాండ్ చెఫ్.. సౌత్ ఇండియన్ మసాలా దోసె..నెటిజన్లు ఫిదా..ఆన్లైన్లోనే తిన్నంత పనిచేశారు

దోసె.. అంటే ఎవరకి ఇష్టం ఉండదూ..అందరూ లొట్టలేసుకుంటూ తింటారు.. దోసె భారతీయులందరికీ పరిచయమైన ఆహారమే అయినా సౌత్ ఇండియన్స్ కి ప్రాణం. ఆలూ దోసె, మసాలా దోసె.. ఆనియన్ దోసె..ఇలా రకరకాల దోసెలు చూస్తుంటేనే నోట్లో లాలాజలం ఉబికి వస్తది. అది మరీ దోసె ప్రత్యేకత.. దోసె ఇండియన్స్ నే కాదు.. చాలా దేశాల్లో అక్కడి ప్రజల హార్ట్ ని దోచేస్తుంది. 

ఆలూ మసాలా ఫిల్లింగ్ దోసె.. క్రంచి ఎక్ట్సీరియర్స్ కు ఫేమస్..  ఈ దోసెను న్యూజీలాండ్ కు చెందిన చెఫ్  ఆండీ హెర్న్ డెన్ దోసె సిద్దం చేస్తూ రెసిపీని ఆన్ లైన్ లో షేర్ చేశాడు. దోసెతోపాటు టమోటా చట్నీ కూడా చేశాడు. దీనికి సంబంధించిన వీడియోతోపాటు క్యాప్షన్ లో ‘‘దోస విత్ ఆలూ మాసాలా, టమాటో చట్నీ’’అని రాశాడు. ఓ చెఫ్ సిద్దం చేస్తూ.. వీడియో చేసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు.. ఇగజూడు.. లైకులే లైకులు.. కామెంట్సే.. కామెంట్స్.. 

వీడియోలో చెఫ్ నానబెట్టిన బియ్యం, డీల్స్ , మెంతి గింజలను కలిపి మృదువైన, పులియబెట్టేందుకు దోస పిండిని సిద్ధం చేయడం కనపడుతుంది. దీంతో పాటు మెత్తని ఆలుగడ్డలతో ఉల్లిపాయలు, వెల్లుల్లి , మసాలా దినుసులను వేయించి కలిపేందుకు రెడీ చేసుకున్నాడు. తద్వారా ఆలూ మసాలా ఫిల్లింగ్‌ను సిద్ధం చేశాడు. చివరగా అతను ఆవాలు, కరివేపాకు , చింతపండు ముద్దలో ఉడికించి శక్తివంతమైన టమోటా చట్నీని సిద్ధం చేశాడు. 

రెసిపీ వీడియో ఆన్‌లైన్‌లో 5.7 మిలియన్ల మంది దోసె ప్రియులు చూశారు. కామెంట్లు, లైకులతో తన దోసెపై ఉన్న ఇష్టాన్ని పంచుకున్నారు. 

ఓ నెటిజన్ రాస్తూ.. నేను రోజూ దోసె తింటాను. దక్షిణ భారతీయుడిగా గర్విస్తున్నా అన్నాడు. 

ఇంకో నెటిజన్ స్పందిస్తూ..‘‘ సౌత్ ఇండియన్ గా చాలా ఇంప్రెస్ అయ్యా  అని చెప్పాడు. 

మరో నెటిజన్ ఇలా రాశాడు..‘‘ దోసె తో పాటు అత్యంత ముఖ్యమైన కొమ్మరి చట్నీని మిస్సయారు. చేసి చూడండి.. అయితే మీరు రెసిపీ చేసిన విధానం చాలా బాగుంది అన్నాడు. 

ఏదీ ఏమైనా.. సౌత్ ఇండియన్ రెసిపీ టేస్టీ టేస్టీ మసాలా దోసె రుచిని  దేశ విదేశాల్లో ప్రజలు అస్వాదిస్తున్నారు. చాలా గ్రేట్..