వణుకుడే : క్యాబేజీలో పాము పిల్ల

ఆకు కూరలు, క్యాబేజీ, కాలీఫ్లవర్, బ్రోకలీ, బఠానీలు వంటి ఆకుపచ్చ కూరగాయలలో చిన్న కీటకాలు తరచుగా కనిపిస్తాయి. కొన్నిసార్లు అవి కంటికి కనపడకుండా ఉంటాయి. చిన్న చిన్న కీటకాలే కాదు పెద్ద పెద్ద పాములు కూడా కంటికి కనపడకుండా దాక్కుంటాయి.  తాజాగా క్యాబేజీ ఆకుల మధ్య ఓ పామును గుర్తించిన వ్యక్తి  భయపడ్డాడు.  వివరాల్లోకి వెళ్తే ....

జనాలు కొంతమంది కూరగాయలను మార్కెట్​ లో కొనుగోలు చేస్తే... మరికొంతమంది దగ్గర్లో కూరగాయలు సాగు చేసే తోటలు ఉంటే అక్కడకు వెళ్లి తెచ్చుకుంటారు.  సాధరణంగా పొలాల్లో అంటే చాలా జాగ్రత్తగా వెళ్లాలి.  పాములు.. జెర్రులు లాంటివి తిరుగుతుంటాయి.  అయితే ఇక విషయానికొస్తే.. ఓ వ్యక్తి క్యాబేజీని కోసేందుకు తోటకు వెళ్లాడు.  కోయడానికి ప్రయత్నిస్తుండగా.. లోపలి భాగం చూశాడు.. ఇక అంతే వెంటనే అతని ఫ్యూజులు మాడిపోయాయి..  అంటే ఆయన ఎంత భయపడ్డాడో ఊహించుకోండి. 

అసలేం జరిగిందంటే... క్యాబేజీని కోస్తుండగా  ఆకుల మధ్యలో పామును గుర్తించాడు.  భయంతో వెనక్కు వెళ్లి పామును పట్టే వ్యక్తిని పిలిచాడు. స్నేక్​ క్యాచర్​ రాగానే ఆకుల మధ్యన ఉన్న పామును పట్టుకున్నాడు. స్నేక్​ క్యాచర్​ ఆర్తి  స్నేక్ క్యాచర్ ఆర్తి ఈ వీడియోని తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా @aartirescuerwildlifephotographyలో షేర్ చేసింది.  ఈ వీడియో వైరల్​ కావడంతో నెటిజన్లు స్పందించారు.  పొలాల్లోకి పాములు ఎలుకలు.. క్రిములను తినేందుకు వస్తాయని ఒకరు రాయగా...  కూరగాయలను జాగ్రత్తగా చూసిన తరువాతే ఉడికించాలని మరొకరు రాశారు.  ఇక మూడో వ్యక్తి  ఈ పాములు విషపూరితమైనవి కాదు.. భయపడాల్సిన అవసరం లేదని రాయగా.. ఇంకొక వ్యక్తి క్యాబేజీలోపలికి పాము ఎలా చేరిందని రాసుకొచ్చారు.