బీ అలర్ట్ : ఏసీ గదుల్లో సిగరెట్ తాగుతున్నారా.. అయితే మీ బ్రెయిన్, కిడ్నీ, గుండెకు ప్రమాదం

ఈ మధ్యకాలంలో ఎక్కువగా పెరిగిపోతున్న చెడు అలవాట్లలో సిగరెట్ ఒకటి. సరదాగానో, ఫ్యాషన్ గానో మొదలయ్యే సిగరెట్ అలవాటు వ్యసనంగా మారుతుంది. మొదట్లో రోజుకొక సిగరెట్ తాగేవారు, దీనికి బానిసగా మారితే ప్యాకెట్లు ప్యాకెట్లు చొప్పున పీల్చేస్తారు. ఇది మనిషిని ఒక్కసారిగా కాకుండా నెమ్మదిగా నాశనం చేస్తుంది. దురదృష్టం ఏంటంటే దీని వల్ల వాటిల్లే నష్టం పీక్స్ కి చేరేంతవరకు గుర్తించలేం. మాములుగా సిగరెట్ తాగటమే ఇంత ప్రమాదం అయితే,ఏసీ రూముల్లో సిగరెట్ తాగటం అంతకు మించి ప్రమాదకరమనితెలుస్తోంది. ఏసీ రూముల్లో సిగరెట్ తాగటం వల్ల బ్రెయిన్, కిడ్నీ, గుండెకు చాలా ప్రమాదం.

ఈ మధ్య పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల ఏసీల్లో మంటలు రావటం చూశాం. వేడి వల్ల ఏసీలో మంటలు రాకుండా ఉండాలంటే ప్రతి రెండు గంటలకోసారి 5నుండి 7నిమిషాల వరకు ఏసిని ఆఫ్ చేసి ఉంచాలని అంటున్నారు నిపుణులు. ఇదిలా ఉండగా ఏసీలో కూర్చొని చాలా మంది సిగరెట్ తాగుతూ ఉంటారు.దీని వల్ల సిగరెట్ తాగటం వల్ల కలిగే నష్టం రెట్టింపవుతుంది.

Also Read:అరటి తొక్క.. గుడ్డు పెంకులే కదా అని పారేయొద్దు.. వాటితో ఇలా చేయొచ్చు తెలుసా..!

వేసవిలో సిగరెట్ వల్ల కలిగే నష్టాలు:

  • హార్ట్ ఎటాక్
  • లంగ్ క్యాన్సర్
  • త్రోట్ క్యాన్సర్
  • పేగుల్లో మంట
  • మైగ్రేన్
  • ఆందోళన

పొగాకు వల్ల కలిగే అనర్థాలు:

  • హార్ట్ ప్రాబ్లమ్స్
  • షుగర్
  • లంగ్ క్యాన్సర్
  • డిప్రెషన్
  • ఆందోళన

ఇంతటి హానికరమైన సిగరెట్ అలవాటు వెంటనే మానెయ్యాలంటే మిరియాలు, లవంగం, పసుపు, ఆకు కూరలు, వాము బాగా హెల్ప్ అవుతాయి.