బొగ్గు తీసుకెళ్తున్న గూడ్స్ రైళ్లో పొగలు.. వ్యాగన్‌లో బొగ్గు బూడిదైంది

జగిత్యాల జిల్లా లింగంపేటలో బొగ్గుతో వెళ్తున్న గూడ్స్ రైల్లో పొగలు చెలరేగాయి. రామగుండం నుంచి నిజామాబాద్ వైపు బొగ్గుతో వెళ్తున్న గూడ్స్ రైల్లో ఈ ప్రమాదం జరిగింది. పొగలు వస్తున్నట్లు గుర్తించి..లింగంపేట రైల్వే స్టేషన్ లో రైలును  నిలిపివేశారు అధికారులు. రైల్లోని ఒక వ్యాగన్ లో బొగ్గు బూడిదగా మారినట్లు గుర్తించారు. సమాచారం అందుకున్న రైల్వే అగ్నిమాపక సిబ్బంది రైల్వే స్టేషన్ చేరుకున్నారు. పొగలను ఆర్పివేశారు. ప్రమాదానికి గల కారణాలపై విచారిస్తున్నారు. వ్యాగన్ లోని బొగ్గులపై వస్తున్న పొగలను నీళ్లు చల్లి ఆర్పారు.