కారు రేసింగ్స్ కోసం కంపెనీ డబ్బు.. : దివాలా తీసిన మొబైల్ కంపెనీ

విలాసాలకు అలవాటుపడ్డ ఓ అమెరికా మొబైల్ కంపెనీ సీఈఓ కారణంగా ఆ కంపెనీనే మూసివేయాల్సి వచ్చింది. కంపెనీ నిధులు లెక్కలు చూపకుండా వాడుకున్నాడు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. OSOM కంపెనీ మాజీ  చీఫ్ ప్రైవసీ ఆఫీసర్ మేరీ స్టోన్ రాస్ దాఖలు చేసిన పిటిషన్ కారణంగా అసలు విషయాలు బయటపడ్డాయి. దీంతో కంపెనీనే  మూసుకోవాల్సి వచ్చింది. 

OSOM కంపెనీ 2020లో ఎసెన్షియల్ మాజీ ఉద్యోగులచే స్థాపించబడింది. ఈ కంపెనీ మొదట్టో ప్రైవర్సీ, సెంట్రల్ డివైజ్ లు తయారీ చేసేది. తర్వాత మొబైల్ ఫోన్లు తయారు చేయడం ప్రారంభించింది. ఆండ్రాయిడ్ అథారిటీ నుంచి వచ్చిన సమాచారం ప్రకారం.. OSOM అనే మొబెల్ ఫోన్ తయారీ సంస్థ ఈ వారంలో మూసివేస్తు్న్నారు. ఇప్పటికే చాలామంది ఉద్యోగులను కూడా తీసేశారు. అంతే కాదు ఆయా ఫోన్స్ యూజర్లకు చివరి స్మార్ట్ ఫోన్ అప్డేట్ అంటూ మెస్సేజ్ లు కూడా వెళ్లాయి. దీనంతటికీ కారణం ఈ కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జాసన్ కిట్స్ లగ్జరీ లైఫ్ గడపడం కోసం కంపెనీ నిధులు ఖర్చు చేశాడు. 

Also Read :- ఆగస్ట్ లోనూ కార్ల అమ్మకాలు 5 శాతం తగ్గాయి

కంపెనీ డబ్బులతో రెండు లంబోర్ఘిని కార్లు కొన్నాడు. అంతే కాదు రేసింగ్ లో బెట్టింగులు కూడా పెట్టాడు. దీంతో ఆ కంపెనీ దివాలా తీసింది. చివరికి మూసి వేస్తున్నారు. డెలావేర్ కోర్ట్ ఆఫ్  ఛాన్సరీలో అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోడానికి కూడా ప్రయత్నిస్తున్నారు. OSOM కంపెనీ మాజీ  చీఫ్ ప్రైవసీ ఆఫీసర్ మేరీ స్టోన్ రాస్ దాఖలు చేసిన పిటిషన్ తో జాసన్ కిట్స్ చేసిన తప్పులు బయటపడ్డాయి. చేసేదేంలేక ఇప్పుడు OSOM కంపెనీ సెప్టెంబర్ ఫస్ట్ వారంలో షెట్‌డౌన్ చేస్తున్నారు.