టెక్నాలజీ : గూగుల్ మీట్ నుంచి స్మార్ట్ టిప్స్‌

గూగుల్ మీట్​లో యాడింగ్, రిమూవింగ్​ పీపుల్ అనే రెండు కాంటెక్స్ట్​లు ఉంటాయి. ఒక మీటింగ్​లో ఉండగానే మరో మీటింగ్​కి అటెండ్ అవ్వచ్చు. అందుకు ఏం చేయాలంటే..

యాడింగ్ లేదా ఇన్వైటింగ్ 

    గూగుల్ క్యాలెండర్​లో ఈవెంట్​కి సంబంధించి డేట్స్ ఎడిట్ చేయాలి.
    తర్వాత గెస్ట్​ను పిలిచి, వాళ్ల ఈ–మెయిల్ అడ్రెస్​లు ఎంటర్ చేయాలి.
    అందరూ యాడ్ అయ్యాక ఈవెంట్ సేవ్ చేయాలి. ఇన్విటేషన్ అందుకున్న వాళ్లు గూగుల్ మీట్​లో జాయిన్ అవ్వొచ్చు. 


షెడ్యూల్ చేసుకోవచ్చు


    మీటింగ్ షెడ్యూల్ చేసేటప్పుడు జాయినింగ్​ లింక్ కాపీ చేసుకోవాలి. 
    ఆ లింక్​ ఎవరికి యాడ్​ చేయాలో వాళ్లకు షేర్ చేయాలి. షేరింగ్ అనేది ఈ–మెయిల్, చాట్ వంటి ఇతర ప్లాట్​ఫామ్​ల ద్వారా కూడా చేయొచ్చు.
    మీటింగ్​ జరిగేటప్పుడు కింద కుడివైపు చివర ఉన్న పీపుల్ అనే ఐకాన్ నొక్కాలి.
    యాడ్ పీపుల్ మీద క్లిక్ చేస్తే పార్టిసిపెంట్ లిస్ట్ వస్తుంది.
    కావాలంటే ఈ–మెయిల్ అడ్రెస్ ఎంటర్ చేయాలి. తర్వాత యాడ్ చేయాలనుకుంటే ఇన్వైట్ మీద క్లిక్ చేయాలి. 
    మీటింగ్​ ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి లింక్ కాపీ చేసి, సెండ్ చేయాలి. 

మీటింగ్​లో ఉన్నప్పుడే తీసేయాలంటే..

మీటింగ్ జరుగుతున్నప్పుడు పార్టిసిపెంట్స్​లో ఎవరినైనా తీసేయాలంటే కూడా తీసేయొచ్చు.  అందుకోసం ఆ పార్టిసిపెంట్ మీదకి కర్సర్ వెళ్లగానే ఒక మెను కనిపిస్తుంది. కిందివైపు చూపించే బాణం గుర్తు మీద క్లిక్ చేస్తే మైక్రో ఫోన్​ లేదా కెమెరా కనిపిస్తుంది. దాన్ని సెలక్ట్ చేసి మెను నుంచి రిమూవ్ చేయాలి.

పీపుల్ ప్యానెల్

కింద కుడివైపు చివరన ఉన్న పీపుల్ ఐకాన్​ మీద క్లిక్ చేయాలి. రిమూవ్ చేయాలనుకుంటున్న పార్టిసిపెంట్​ని లిస్ట్​ నుంచి తొలగించడానికి పేరు మీద డౌన్ యారో క్లిక్ చేయాలి. మెను నుంచి రిమూవ్ చేయడానికి సెలక్ట్ చేయాలి.