మట్టి కుండలకు తగ్గుతున్న ఆదరణ

వేసవి వచ్చిందంటే మట్టి కుండలకు ఒకప్పుడు మంచి డిమాండ్ ఉండేది.  జనాలు రిఫ్రిజిరేటర్లపై మక్కువ చూపిస్తుండగా..  మట్టికుండలనే నమ్ముకున్న కుటుంబాలు గిరాకీలు లేక మండే ఎండలో జనాల కోసం చూస్తున్నారు.

 రూ. 300 పలికే  రంజన్లను 100 రూపాయలు, 200 వరకు అమ్ముతున్నా  జనాలు కొనడం లేదని చిరు వ్యాపారులు వాపోతున్నారు.  నిజామాబాద్ బస్టాండ్ సమీపంలో కొనుగోలుదారులు లేక వెలవెలబోతున్న రంజన్ల దుకాణం. 

వెలుగు ఫొటోగ్రాఫర్​, నిజామాబాద్