ప్రైస్​ ట్యాగ్ గన్..చిన్న కిరాణా షాపులోల్లకు ఎంతో ఉపయోగం​

చిన్న చిన్న కిరాణా షాపులు, ప్రొడక్షన్​ యూనిట్లలో సరుకులకు ప్రైస్​ ట్యాగ్స్​ వేయాల్సి ఉంటుంది. అలాంటివాళ్లకు ఈ గాడ్జెట్ బెస్ట్​ చాయిస్​. సంవర్ధన్​ అనే కంపెనీ దీన్ని తయారుచేసింది. పైగా దీనికి పవర్​, బ్యాటరీలు కూడా అవసరం లేదు. 

ప్రింట్​ చేయాల్సిన నెంబర్లను ముందుగానే సెట్​ చేసుకుని గన్​కు ఉండే హ్యాండిల్​ని నొక్కితే ప్రింట్​ అయిపోతుంది. ఎనిమిది అంకెల వరకు ప్రింట్​ చేసుకోవచ్చు. ఇంక్​ అయిపోయినా ఈజీగా రీఫిల్​ చేసుకోవచ్చు. వన్ టచ్ ఓపెనింగ్ ఇంక్ రోలర్ సిస్టమ్​ ఉంటుంది. 

ఒక్కో లేబుల్ 22 మిల్లీమీటర్ల వెడల్పు, 12 మిల్లీమీటర్ల పొడవు ఉంటుంది. ఈ గన్​తోపాటు ప్యాక్​లో 5,150  లేబుల్స్​,  రెండు ఇంక్ రోలర్లు కూడా వస్తాయి. ధర : 589 రూపాయలు