ముఖ సౌందర్యాన్ని కాపాడుకోవడానికి మనం చాలా హోం రెమెడీస్ ఉపయోగిస్తుంటాం. వాటిలో ఒకటి కొబ్బరి నూనె. ఇది మీ చర్మాన్ని మృదువుగా చేయడమే కాకుండా మొటిమలను క్లియర్ చేస్తుంది. సాధారణంగా చాలా మంది తమ చర్మాన్ని అందంగా ఉంచుకోవడానికి రకరకాల ఖరీదైన ఉత్పత్తులను ఉపయోగిస్తుంటారు. మరికొందరు కొన్ని హోం రెమెడీస్‌ను ఉపయోగిస్తారు. కొబ్బరి నూనె మీ ముఖ సౌందర్యాన్ని పెంచుతుందని మీకు తెలుసా? కొబ్బరి నూనెతో ఆముదం మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి. ఈ ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.
కొబ్బరి నూనె.. కోకోనట్ ఆయిల్.. పారాచూట్ ఆయిల్ వీటిలో ఏ పేరు పిలిచినా ఒకటే. పూర్వకాలంలో నిత్యం కొబ్బరినూనె రాసుకొనేవారు. కేవలం జుట్టుకే కాదు.. ఇందులో కాస్తంత ఆముదం కలిపి బాడీకి మర్దన చేసి.. రెండు మూడు గంటలు నీడలో ఉండి.. ఆ తరువాత గోరు వెచ్చని నీటితో స్నానం చేస్తే చర్మం దగ దగ మెరిసిపోయేది. అదే చంటి పిల్లలకు ఒంటినిండాఆముదం.. కొబ్బరి నూనె కలిపిన నూనె రాసి స్నానం చేయించేవారు. కాని ఆధునిక కాలంలో ఇలాంటివి అన్ని పోయి కొన్ని రకాల రసాయనాలతో తయారు చేసిన సబ్బులను ఉపయోగించడంతో అతి చిన్న వయస్సులోనే చర్మం ముడతలు పడి 20 లోనే 60 సంవత్సరాల ఫేస్ కనపడుతుంది.
కొబ్బరి నూనెలో ఉండే కొవ్వు ఆమ్లాలు, లారిక్, క్యాప్రిక్ యాసిడ్ వాటి యాంటీమైక్రోబయల్ లక్షణాల వల్ల చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో అద్భుతంగా ఉన్నాయి. అంటే అవి మన చర్మంపై పెరిగే హానికరమైన సూక్ష్మజీవులను చంపుతాయి. మొటిమలు, ఫోలిక్యులిటిస్, సెల్యులైటిస్ వంటి సాధారణ చర్మ ఇన్ఫెక్షన్లు శిలీంధ్రాలు, బ్యాక్టీరియా వల్ల సంభవిస్తాయి. వీటిని కొబ్బరి నూనెలోని లారిక్, క్యాప్రిక్ యాసిడ్ చంపడానికి సహాయపడతాయి.
కొబ్బరి నూనె అధిక తేమను కలిగి ఉంటుంది. పొడి, పగిలిన చర్మానికి కొబ్బరి నూనె అత్యంత ప్రభావవంతమైన మాయిశ్చరైజర్‌గా పని చేస్తుంది. కొబ్బరి నూనె చర్మాన్ని హైడ్రేట్ చేయడానికి, తేమను బాగా నిలుపుకోవడానికి సహాయపడుతుంది. అంటే పొడి చర్మం కోసం కొబ్బరి నూనె అద్భుతమైనది.కొబ్బరి నూనె మన శరీరంలోని యాంటీఆక్సిడెంట్లు, కొల్లాజెన్ స్థాయిని పెంచే సామర్థ్యాన్ని కలిగి ఉందని అధ్యయనాలు నిరూపించాయి. ఇవి మన చర్మం యొక్క సహజ పునరుత్పత్తి, మరమ్మత్తు ప్రక్రియలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.
ముడతలను తగ్గిస్తుంది: ముఖంపై ముడతలు లేదా సన్నని గీతలు వంటి వృద్ధాప్య సంకేతాలు ఉంటే, మీరు కొబ్బరి నూనె, ఆముదం ఉపయోగించవచ్చు. ఈ రెండింటిలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ నుండి చర్మాన్ని రక్షించడమే కాకుండా ముఖంపై వృద్ధాప్య ప్రక్రియను నెమ్మదిస్తాయి. ఇది ముడతలు, ఫైన్ లైన్ల నుండి ఉపశమనాన్ని అందిస్తుంది.
చర్మం మృదువుగా మారుతుంది: కొబ్బరి నూనె, ఆముదం నూనె ఈ రెండు నూనెల మిశ్రమాన్ని రాత్రి నిద్రించే ముందు మీ ముఖంపై రాయండి. మీ చర్మం నునుపుగా మారుతుంది. ఇవి చర్మాన్ని కాంతివంతంగా, ఆరోగ్యంగా ఉంచుతాయి. అలాగే పొడి చర్మం ఉన్నవారు దీన్ని రోజూ ముఖానికి రాసుకోవచ్చు.
మొటిమలను తొలగిస్తుంది: కొబ్బరినూనెను ఆముదంతో కలిపి రాత్రి పడుకునే ముందు ముఖానికి రాసుకుంటే మొటిమలు పోతాయి. ఎందుకంటే వాటిలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. ఇవి మొటిమలను క్లియర్ చేయడంలో సహాయపడతాయి. ఇది మొటిమలను నివారిస్తుంది.
టానింగ్‌ను తొలగిస్తుంది: వేసవి ఎండ నుండి ముఖం కాంతివంతంగా కనిపిస్తుంది. ముఖంపై సన్ టాన్ ఉంటే కొబ్బరినూనెలో ఆముదం కలిపి రాత్రిపూట ముఖానికి రాసుకుంటే టాన్ తగ్గుతుంది. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా, తేమగా ఉంచుతుంది.
స్కిన్ ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది: రాత్రి పడుకునే ముందు కొబ్బరినూనెలో ఆముదం కలిపి ముఖానికి రాసుకుంటే చర్మం మంట తగ్గుతుంది. ఆముదం నూనెలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. మంటను తగ్గించడంలో సహాయపడుతుంది. కొబ్బరి నూనె కూడా మొటిమలను నివారిస్తుంది.
కొబ్బరినూనెతో ఆముదం కలిపి ముఖానికి రాసుకోవడం ఎలా?
ముందుగా మీరు 2 టీస్పూన్ల కొబ్బరి నూనె తీసుకోవాలి. దానికి కొన్ని చుక్కల ఆముదం కలపండి.. దీన్ని మీ ముఖానికి అప్లై చేసి 2 నుంచి 3 నిమిషాల పాటు మసాజ్ చేసి రాత్రంతా అలాగే ఉంచాలి. తర్వాత ఉదయం మామూలుగానే ముఖం కడుక్కోవాలి. ఇలా కొన్ని రోజులు చేస్తే మీ ముఖం మెరిసిపోతుంది. మెుటిమలు తగ్గుతాయి.