ఇంట్లో ఎవరికైనా హెల్త్ ప్రాబ్లమ్స్ చెప్పి రావు.. చిన్న ఆరోగ్య సమస్య కూడా ముదిరితే పెద్ద ప్రమాదంగా మారుతుంది. ఎప్పటికప్పుడు మన హెల్త్ మానిటరింగ్ చేసుకోవాలి. హెల్త్ చెక్‌అప్ కోసం తరుచూ హాస్పిటళ్లు చుట్టూ తిరగలేం కదా.. అందుకే ఓ ఆరు రకాల మెడికల్ టెస్టింగ్ పరికరాలు మనం ఇంట్లో ఉంచుకోవాలి. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
1. పోర్టబుల్ ECG మానిటర్
పోర్టబుల్ ECG మానిటర్ స్మార్ట్ ఫోన్ యాప్ తో హార్ట్ బీట్ రికార్డ్ చేస్తుంది. అలాగే ఆపిల్ వాచ్, స్మార్ట్ వాచ్ లు గుండె లయను సూచిస్తూ మన ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు తెలియజేస్తాయి.
2. బ్లడ్ ప్రెజర్ మానిటర్
కాంపాక్ట్, బ్లడ్ ప్రెజర్ ట్రాక్ చేయగల ఎలక్ట్రానిక్ పరికరాలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.
3. పల్స్ ఆక్సిమీటర్
ఇది రక్తంలో ఆక్సీజన్ లెవల్ ను కొలుస్తోంది. కోవిడ్ 19 తర్వాత దీని గురించి చాలామంది తెలుసుకున్నారు.
4. గ్లూకోమీటర్
రక్తంలో షుగర్ లెవల్స్ ఎంత శాతం ఉన్నాయని ఈ మీటర్ తో తెలుసుకోవచ్చు. డయాబెటిస్ పేషంట్లు ఉన్న ఇంట్లో ఇది తప్పని సరి.. ఎందుకంటే వాళ్ల రక్తంలో తరుచూ చక్కెర స్థాయిలు హెచ్చతగ్గులు ఉంటాయి.
5.కాంటాక్ట్ లెస్ IR థర్మామీటర్
ఇది అందరికి తెలిసిన పరికరమే. ఒంట్లో జ్వరం ఎంత నమోదైందనే దాన్ని థర్మామీటర్ లెక్కిస్తుంది. కాంటాక్ట్ లెస్ థర్మామీటర్ వాడటం ఉత్తమం.
6. మెడికల్ అలర్ట్ సిస్టమ్
ఫ్యామిలీలో వృద్ధులకు, చిన్నపిల్లలకు ఎప్పుడైనా మెడికల్ ఎమర్జెన్సీ అవసరం కావచ్చు. వారు పడిపోయినప్పుడు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లేదా ఛాతీ నొప్పి ఉన్నప్పుడు వారికి ఇతరుల సహాయం అవసరం. అప్పుడు వెంటనే వారి ఈ మెడికల్ ఎమర్జెన్సీ సిస్టమ్ అలారం మోగించి వారి అలర్ట్ తెలపవచ్చు.