రెండో రోజు ఆరుగురు అభ్యర్థుల నామినేషన్

నిజామాబాద్​, వెలుగు: ఇందూరు పార్లమెంట్​ స్థానంలో  శుక్రవారం ఆరుగురు అభ్యర్థులు మొత్తం ఏడు సెట్ల నామినేషన్లను రిటర్నింగ్​ఆఫీసర్ కలెక్టర్​రాజీవ్​గాంధీ హన్మంతుకు అందించారు.  పసుపు రైతులు వెంటరాగా వారు వేసిన పసుపు కొమ్మ దండతో నగరంలోని ఇంటి నుంచి  కలెక్టర్​ కార్యాలయం చేరిన బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్​ ఒక సెట్​ నామినేషన్​ వేశారు.  బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్​ అభ్యర్థిగా బాజిరెడ్డి గోవర్ధన్​ రెండు సెట్ల నామినేషన్​ పత్రాలు సమర్పించారు.  

రాజ్యసభ సభ్యుడు కేఆర్​సురేశ్​రెడ్డి, మాజీ మంత్రులు శ్రీనివాస్​గౌడ్​, వేముల ప్రశాంత్​రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్​గుప్తాతో కలిసి ఒక నామినేషన్ సెట్ వేయగా..   జగిత్యాల జడ్పీ చైర్​పర్సన్​ దావ వసంత, కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్​కుమార్​, బోధన్​ మాజీ ఎమ్మెల్యే షకీల్​భార్య అయేషా ఫాతిమా, పార్టీ జిల్లా ప్రెసిడెంట్​ జీవన్​రెడ్డితో కలిసి మరో నామినేషన్​సెట్​అందజేశారు.  బహుజన్​ ముక్తి పార్టీ తరఫున దేవతి శ్రీనివాస్​, ధర్మసమాజ్​ పార్టీ అభ్యర్థిగా కండెల సుమన్, ఇండిపెండెంట్​క్యాండిడేట్లుగా రాగి అనిల్, రాపెల్లి శ్రీనివాస్​ నామినేషన్లు సమర్పించారు.