ముప్కాల్ లో హాస్పిటల్ నిర్మాణానికి స్థలపరిశీలన

బాల్కొండ,వెలుగు : ముప్కాల్ లో ప్రభుత్వ హాస్పిటల్ నిర్మాణానికి శుక్రవారం ఆర్డీవో రాజా గౌడ్, డిప్యూటీ డీఎం అండ్ హెచ్ వో రమేశ్​ స్థల పరిశీలన చేశారు. ముప్కాల్ కు హాస్పిటల్​మంజూరైంది.  దీంతో అనువైన హాస్పిటల్​ నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించి ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తామని ఆర్డీవో తెలిపారు.

కార్యక్రమంలో పోచంపాడ్ క్లస్టర్ ఇన్​చార్జి రాకేశ్, వీడీసీ ప్రెసిడెంట్ సిద్ధ రమేశ్,సెక్రటరీ నేర నర్సయ్య, గ్రామ పరిరక్షణ సమిటీ ప్రెసిడెంట్ శ్రీకాంత్ యాదవ్,సెక్రటరీ సంజీవ్ థామస్  పాల్గొన్నారు.