ధర్మారం గ్రామంలో వైభవంగా సీతారాముల కల్యాణం

శంకరపట్నం, వెలుగు:   కరీంనగర్​ జిల్లా శంకరపట్నం మండలం కన్నాపూర్ ​ధర్మారం గ్రామంలో బుధవారం సీతారాముల కల్యాణ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ హాజరై పూజలు చేశారు. మహిళలు మంగళహారతులతో తరలివచ్చి కల్యాణ వేడుకల్లో పాల్గొన్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బసవయ్య, లీడర్లుకుమారస్వామి, ప్రవీణ్,  రవి, హనుమాన్ మాలధారులు, భక్తులుపాల్గొన్నారు.