పోలీస్ అంటే సేఫ్టీ, ప్రజలకు సెక్యూరిటీ ఇచ్చే ఒక వెపన్

సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పోలీస్ అమరవీరుల సంస్కరణ వారోత్సవాల్లో భాగంగా సిరిసిల్ల జిల్లా కేంద్రంలో  బతుకమ్మ ఘాట్ నుండి నేతన్న చౌరస్తా వరకు 2K రన్ నిర్వహించారు.  ఈ కార్యక్రమంలో  జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తో పాటు ఇతర  పోలీస్ అధికారులు, సిబ్బంది  పాల్గొన్నారు.   పోలీస్ అంటే సేఫ్టీ... ప్రజలకు సెక్యూరిటీ ఇచ్చే ఒక వెపన్ అని ఎస్పీ తెలిపారు. పోలీస్ అమరవీరుల జ్ఞాపకార్థం సిరిసిల్లలో  టూ కే రన్ నిర్వహించామని ఎస్పీ అన్నారు. పోలీసుల త్యాగాలకు గుర్తుగా, వాళ్లు గుర్తుపెట్టుకోవడానికి ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు.