కేటీఆర్​ నైజం దోచుకోవడం.. దాచుకోవడం: కేకే మహేందర్​ రెడ్డి

సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్​ మాట తప్పారని నియోజకవర్గ కాంగ్రెస్​ ఇన్​ చార్జి కేకే మహేందర్​ రెడ్డి అన్నారు.  ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కేటీఆర్​సిరిసిల్లలోనే ఉండి నియోజకవర్గ సమస్యలను పరిష్కరిస్తానని చెప్పి మాట తప్పారన్నారు.కేటీఆర్​ నైజం దోచుకోవడం.. దాచుకోవడం అని ఎద్దేవా చేశారు.  తన నియోజకవర్గం గురించి పట్టించుకోని ఎమ్మెల్యే కేటీఆర్​ కు . సీఎం రేవంత్​ రెడ్డిని విమర్శించే స్థాయి లేదన్నారు. బీఆర్ఎస్​ హయాంలో ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా..ప్రజా సమస్యలపై పోరాడి సీఎం అయ్యారన్నారు.

ALSO READ | అలా ఎలా కూలుస్తారు..?: హైడ్రా కమిషనర్ రంగనాథ్‎కు హైకోర్టు నోటీసులు

కేసీఆర్​ ముఖ్యమంత్రిగా ఉండగా పద్మశాలీలకే రూ. 50 లక్షలు ఇచ్చారని అబద్దాలు చెబుతున్నారని... బీఆర్​ఎస్​ హయాంలో విరాళాలు సేకరించి  రూ. 50 లక్షలు ఇచ్చామని.. ఇంకా వాటిని కూడా ఇవ్వలేదన్నారు.  బీఆర్​ఎస్​ హయాంలో కాటన్​ పరిశ్రమ లేకుండా చేస్తే...కాంగ్రెస్​ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నేతన్న చేయూత పథకం ద్వారా ఆర్థిక సాయం చేసిందన్నారు.  


గత ప్రభుత్వంలో చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటే పోలీసులను  అడ్డుపెట్టుకుని బయటకి రాకుండా చేసారు. బీఆర్​ఎస్​ పాలించిన  10 ఏళ్లలో 100 మంది చనిపోయారన్నారు.1312 కోట్ల రూపాయలు బతుకమ్మ చీరలకు  వెచ్చిస్తే ఒక్కొక్క కార్మికునికి 33 లక్షలు రావాలి అవన్నీ రూపాయలు ఎక్కడికి పోయాయని సిరిసిల్ల కాంగ్రెస్​ నేత కేకే మహేందర్​ రెడ్డి ప్రశ్నించారు. గత ప్రభుత్వంలోనే టెక్స్​ టైల్ పార్క్ తరలిపోతుంటే  ఎందుకు ఆపలేదన్నారు. కాంగ్రెస్​ అధినేత్రి సోనియాగాంధీ తెలంగాణ ఇస్తే.. బీఆర్​ఎస్​ ప్రభుత్వ హయాంలో తెలంగా నట్టేట మునిగిందని.. కమిషన్ల కోసం కాళేశ్వరాన్ని నిర్మించారన్నారు.