నామ్‌‌‌‌‌‌‌‌కే వాస్తేగా రిక్రియేషన్‌‌‌‌‌‌‌‌ .. సీఈఆర్​ క్లబ్‌‌‌‌‌‌‌‌లో అందని సేవలు 

  • గని కార్మికులకు దక్కని ఆటవిడుపు 
  • శాలరీ నుంచి పైసల్‌‌‌‌‌‌‌‌ కట్‌‌‌‌‌‌‌‌ చేస్తున్నా క్లబ్‌‌‌‌‌‌‌‌లో సౌలత్‌‌‌‌‌‌‌‌ల్లేవ్‌‌‌‌‌‌‌‌ 
  • ఆహ్లాదానికి దూరమవుతున్న కార్మికులు 

గోదావరిఖని, వెలుగు: బొగ్గు గనులు, ఓపెన్​ కాస్ట్‌‌‌‌‌‌‌‌లలో పనిచేసే సింగరేణి కార్మికులకు ఆటవిడుపు కరువైంది. కార్మికుల నుంచి నెలకు రిక్రియేషన్​ పేరిట డబ్బులు వసూలు  చేస్తున్నప్పటికీ క్లబ్​పరంగా సేవలు అందడం లేదు. క్యారమ్​, చెస్​ రూమ్​లకు తాళాలు వేయడంతో పాటు నామ్​కే వాస్తేగా రీడింగ్​ రూమ్​, టీవీ హాల్​ ఉండడంతో కార్మికులు క్లబ్​ వైపు రావడం లేదు. గోదావరిఖనిలో నివాసముంటూ ఇతర డివిజన్లలో పనిచేస్తున్న వారి నుంచి అధికంగా డబ్బులు వసూలు చేయడంపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

డబ్బు వసూళ్లలో తేడాలు 

గోదావరిఖని సింగరేణి స్టేడియం పక్కన ఉన్న కాలరీ ఎంప్లాయిస్​ రిక్రియేషన్​ (సీఈఆర్​) క్లబ్​లో సుమారు 1200 మంది సభ్యులు ఉన్నారు. వీరికి రిక్రియేషన్‌‌‌‌‌‌‌‌ కోసమని క్లబ్‌‌‌‌‌‌‌‌బాధ్యులు కార్మికుల జీతాల్లోంచి కొంత వసూలు చేసేవారు. ప్రతి కార్మికుడి వేతనంలో నెలకు రూ.20 చొప్పున ఏడాదికి రూ.240 కట్​ చేసి క్లబ్​ ఖాతాలో జమ చేస్తారు. ఇదంతా బాగానే ఉన్నా గోదావరిఖనిలో నివాసముంటూ పక్కనే ఉన్న ఆర్జీ 2, ఆర్జీ 3, శ్రీరాంపూర్​, బెల్లంపల్లి డివిజన్లలో పనిచేసే కార్మికులకు సభ్యత్వం కావాలంటే ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్నారు.

పర్సనల్​ డిపార్ట్​మెంట్​ ఆఫీసర్లు తీసుకున్న నిర్ణయం మేరకు ఆర్జీ 1 ఏరియా కాకుండా మిగతా ఏరియాల్లో పనిచేసే కార్మికుల వేతనాల నుంచి నెలకు రూ.50 చొప్పున ఏడాదికి రూ.600 కట్​ చేస్తున్నారు. ఆర్జీ 1 ఏరియాలో పనిచేసే కార్మికుల పిల్లలకు మూడు నెలలకు రూ.300 వసూలు చేస్తే, గోదావరిఖనిలో నివాసముంటూ ఇతర డివిజన్లలో పనిచేసే కార్మికుల పిల్లలకు మాత్రం రూ.450 వసూలు చేస్తున్నారు. దీనిపై ఇతర డివిజన్ల కార్మికులు మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

స్పోర్ట్స్‌‌‌‌‌‌‌‌ రూమ్‌‌‌‌‌‌‌‌లకు తాళాలు 

రిక్రియేషన్‌‌‌‌‌‌‌‌ క్లబ్‌‌‌‌‌‌‌‌లో క్యారమ్‌‌‌‌‌‌‌‌, చెస్‌‌‌‌‌‌‌‌ రూమ్‌‌‌‌‌‌‌‌లకు నాలుగు నెలలుగా తాళాలు వేసి ఉన్నాయి. దీంతో డ్యూటీకి వెళ్లి వచ్చాక ఈ ఆటలు ఆడుదామనుకున్న కార్మికులకు నిరాశే ఎదురవుతోంది. ఇక టీవీ హాల్​ ఉన్నప్పటికీ అది ఎప్పుడు తెరుస్తారో తెలియని స్థితి ఉంది. రీడింగ్​ రూమ్​ ఉన్నా అందులో కుర్చీలు, టేబుళ్లు లేకపోవడం,  కేవలం ఒకే పేపర్​ వేయిస్తుండడంతో క్లబ్​ సభ్యులు అటువైపు కన్నెత్తి చూడడం లేదు.  మరోవైపు క్లబ్‌‌‌‌‌‌‌‌ ఆవరణలో ఉన్న జిమ్‌‌‌‌‌‌‌‌లో ఏర్పాటు చేసిన ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వో ప్లాంట్‌‌‌‌‌‌‌‌ ఏడాదిగా రిపేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉంది. దీంతో తాగునీటి కోసం కార్మికులు, వారి పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. 

క్లబ్‌‌‌‌‌‌‌‌లో చోరీలు 

సింగరేణి సీఈఆర్​ క్లబ్‌‌‌‌‌‌‌‌లో గతంలో నైట్​వాచ్​మెన్​ ఉండేవాడు. ఆరు నెలల కింద అతడిని తొలగించడంతో క్లబ్​లో చోరీలు పెరిగాయి. ఇటీవల క్లబ్​కు చెందిన రెండు కూలర్లను చోరీకి గురయ్యాయి. వాచ్‌‌‌‌‌‌‌‌మెన్‌‌‌‌‌‌‌‌ లేకపోవడంతో కొందరు క్లబ్‌‌‌‌‌‌‌‌లో అసాంఘిక కార్యకలాపాలు సాగుతున్నాయనే ప్రచారం ఉంది. మరోవైపు స్థానిక విఠల్​నగర్​లో ఉండే జీసీవోఏ క్లబ్​ హాల్‌‌‌‌‌‌‌‌లో కార్మికుల పిల్లల వివాహాలు, ఇతర కార్యక్రమాల కోసం నామినల్​ రెంట్​పై ఇచ్చేవారు. కానీ దానిని ఆఫీసర్లు పట్టించుకోకపోవడంతో ఫంక్షన్‌‌‌‌‌‌‌‌ హాల్‌‌‌‌‌‌‌‌లో ఉన్న తలుపులు, కిటీకీలు చోరీకి గురయ్యాయి. సరైన పర్యవేక్షణ లేకపోవడం వల్ల ప్రస్తుతం జీసీవోఏ క్లబ్​ బూత్​ బంగ్లాను తలపిస్తోంది. 

కానరాని క్లబ్​ డే 

గోదావరిఖని సీఈఆర్​ క్లబ్​లో సుమారుగా 1200 మంది సభ్యులు ఉంటారు. వీరి వద్ద నుంచి వసూలు చేసిన మొత్తాన్ని క్లబ్​ ఖాతాలో జమచేస్తారు. ఏటా క్లబ్​ డే నిర్వహించి సభ్యులందరికీ గిఫ్ట్‌‌‌‌‌‌‌‌లు అందజేయాల్సి ఉంటుంది. కాగా 2023లో క్లబ్‌‌‌‌‌‌‌‌ డే నిర్వహించలేదు. అంతకుముందు జరిగిన క్లబ్‌‌‌‌‌‌‌‌ డేలోనూ కొద్దిమందికే గిఫ్ట్‌‌‌‌‌‌‌‌లు అందజేశారని, మిగతావి ఏమయ్యాయని సభ్యులు ప్రశ్నిస్తున్నారు. అసలు రిక్రియేషన్ క్లబ్​లో ఎంత వసూలవుతోంది.. దేనికి ఖర్చు చేస్తున్నారు...అనే విషయాలపై ఆడిట్​ చేస్తే అసలు విషయాలు వెలుగు చూసే అవకాశం ఉంది. ఇప్పటికైనా సీఈఆర్​ క్లబ్​ను గాడిన పెట్టి తమకు రిక్రియేషన్ క్లబ్​ సేవలు అందేలా చూడాలని కార్మికులు జీఎంను కోరుతున్నారు.