సింగరేణి లెవల్​ ఫుట్ బాల్ విన్నర్ శ్రీరాంపూర్​ టీమ్

కోల్​బెల్ట్, వెలుగు:​ మందమర్రి సింగరేణి హైస్కూల్​ గ్రౌండ్​లో రెండు రోజులు నిర్వహించిన సింగరేణి కంపెనీ లెవల్​ఫుట్​బాల్​ పోటీలు బుధవారం  ముగిశాయి. ఫైనల్​పోటీల్లో శ్రీరాంపూర్​ ఏరియా జట్టు విన్నర్​గా నిలిచింది. సింగరేణి వ్యాప్తంగా అన్ని ఏరియాల నుంచి జట్లు పాల్గొన్నాయి. శ్రీరాంపూర్​ ఏరియా జట్టు క్రీడాకారులు ఉత్తమ ప్రతిభ కనబర్చి ప్రత్యర్థి జట్లను ఓడించారు. 

విన్నర్​శ్రీరాంపూర్, రన్నర్  రామగుండం1,2 ఏరియా జట్లకు మందమర్రి ఏరియా సింగరేణి పర్సనల్ మేనేజర్​శ్యాంసుందర్​, ఏఐటీయూసీ కేంద్ర కమిటీ సెక్రటరీ ఎండీ. అక్బర్​అలీ బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో సింగరేణి ఆఫీసర్స్​అసోసియేషన్​ ప్రెసిడెంట్ రమేశ్, వర్క్​ పీపుల్​ స్పోర్ట్స్​అండ్​గేమ్స్​అసోసియేషన్​హానరబుల్​సెక్రటరీ కార్తీక్​, స్పోర్ట్స్​సూపర్​వైజర్లు పాస్​నెట్, జాన్​వెస్లీ, సీహెచ్.​అశోక్​, హెచ్.రమేశ్​, పి.శ్రీనివాస్​, నరేందర్​రెడ్డి తదితరులు పాల్గొన్నారు.