Savings : పొదుపు చేయాలనుకువారికి.. బెస్ట్ సేవింగ్స్కి చిట్కాలు ఇవిగో..

పొదుపు.. ప్రతి ఒక్కరికీ అవసరం. ప్రతి నెలా కొంత మొత్తం పొదుపు చేస్తే.. అవసరమైనప్పుడు అది ఉపయోగపడుతుంది. రిటైర్డ్ అయిన తర్వాత జీవితం హ్యాపీగా సాగాలంటే.. ఉద్యోగంలో చేరిన మొదటి రోజు నుంచే ఎంతో కొంత మొత్తాన్ని దాచుకోవాలి. లేదంటే పెద్దవాళ్లయ్యాక డబ్బుల కోసం కష్టపడాల్సి వస్తుంది. ప్రతి ఒక్కరూ తప్పకుండా అత్యవసర నిధి ఏర్పాటు చేసుకోవాలి. ఇది అత్యవసర సమయాల్లో ఆదుకుంటుంది. 

ఉదాహరణకు అనుకోని ప్రమాదాలు జరిగి.. ఆస్పత్రి పాలైనపుడు.. సమయానికి జీతాలు అందనప్పుడు.. పొదుపు చేసుకున్న డబ్బు అండగా ఉంటుంది. కాబట్టి, మూడు లేదా ఆరు నెలల జీతాన్ని అత్యవసర నిధి కింద పెట్టుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. పరిమితులు పెట్టుకోవాలి.. ఒక లక్ష్యం పెట్టుకుని.. దానికి తగినట్టు పొదుపు చేసుకుంటే ఎలాంటి సమస్య ఉండదు. 

Also Read :- 900 ఏళ్ల కింద దాచిపెట్టిన బంగారం.. తవ్వకాల్లో బయట పడింది

పిల్లల చదువు. ఇల్లు, కారు.. ఇలా ఏదైనా కొన్ని పరిమితులు పెట్టుకుని పొదుపు చేసుకోవాలి. లక్ష్యాలతో పాటు సరదాలు, సంతోషాలు కూడా ముఖ్యం. కాబట్టి, దానికి కూడా కొంత మొత్తాన్ని విడిగా పెట్టుకుంటే మంచిది. ప్రస్తుతం కొన్ని బ్యాంకులు తాత్కాలిక లక్ష్యాల కోసం కూడా పొదుపు చేసుకునేఅవకాశం కల్పిస్తున్నాయి. 

ఇలా చేస్తే ఎక్కువ పొదుపు చేయొచ్చు..

• జీతం రాగానే కొంత డబ్బుని దాచుకోవాలి. అంటే కొంత మొత్తం నేరుగా మరో సేవింగ్స్ అకౌంట్లో వేసుకోవాలి. దీంతో ఏడాది తర్వాత కచ్చితంగా రిజల్ట్ కనిపిస్తుంది. 

• ఉద్యోగంలోచేరిన కొన్ని రోజులు స్టూడెంట్ తక్కువ బడ్జెట్తో సర్దుకుపోవాలి. జీతం రాగానే కొంత మొత్తం మాత్రమే అకౌంట్లో ఉంచుకుని మిగతాది ఫిక్స్డ్ డిపాజిట్స్, ఫండ్ స్.. లాంటి వాటిల్లోకి బదిలీ చేసుకోవాలి. ఇలా చేస్తే కొన్నాళ్లకి అదే అలవాటు అవుతుంది. 

• షాపింగ్, డిన్నర్స్.. లాంటివి ఆఫర్స్ ఉన్నప్పుడు చూసుకుని ప్లాన్ చేసుకుంటే అదనపు ఖర్చులుండవు. 

• క్రెడిట్ కార్డు ఎడాపెడా వాడితే జీతం అంతా దానికే సరిపోతుంది. అందుకే అది పక్కన పెట్టి డబ్బులు వాడాలి. దీంతో డబ్బు అయిపోతోందన్న స్పృహ ఉంటుంది. ఫలితంగా ఖర్చులు కూడా తగ్గుతాయి. 

• డెబిట్ కార్డు ఇంట్లో పెట్టి.. బయటకు వెళ్తే చాలా ఖర్చులు తగ్గుతాయి. ఏదైనా కొనేటప్పుడు.. అది నాకు అవసరమా? అనేది ఆలోచించు కోవాలి. ఇలా చేస్తే.. డబ్బులను ఎలా ఖర్చు చేయాలో అర్థమవుతుంది.