IT Layoffs: టెక్ కంపెనీలలో సైలెంట్ లేఆఫ్స్..రెండు నెలల్లో 20వేల మంది తొలగింపు

IT Layoffs: ఐటీ కంపెనీల్లో ఉద్యోగుల తొలగింపులు కొనసాగుతూనే ఉన్నాయి. గత మూడు సంవత్సరాలుగా లక్షలాది మంది టెక్ ఎంప్లాయీస్ తమ ఉద్యోగాలు కోల్పోయారు. కొన్ని కంపెనీలు కొంత సమయం ఇచ్చి తొలగింపులు చేపడితే.. కొన్ని కంపెనీలు ఉద్యోగులకు చెప్పాపెట్టకుండా సైలెంట్ గా తొలగిస్తున్నాయి. కంపెనీ నిర్వహణ, ప్రపంచ ఆర్థిక సంక్షోభం వంటి కారణాలతో ఖర్చుల తగ్గించుకునే క్రమంలో తమ వర్క్ ఫోర్స్ ను తగ్గించుకుంటున్నామని ప్రకటించాయి. దీంతో ఈ లే ఆఫ్స్ టెకీలలో టెన్షన్ పెంచేస్తున్నాయి. ఐటీ కంపెనీల్లో టెక్ ఉద్యోగులకు జాబ్ సెక్యూరిటీపై భయం పట్టుకుంది. ఇలాంటి నిర్ణయాలతో రోడ్డు పడుతున్నామని టెక్ ఉద్యోగులు సోషల్ మీడియా ద్వారా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

2023 ప్రారంభం నుంచి ఈ ఐటీ కంపెనీల్లో ఈ లేఆఫ్స్ పరంపర కొనసాగుతోంది. ప్రారంభంలో వందలతో లేఆఫ్స్ ప్రారంభించిన టెక్ కంపెనీలు.. క్రమక్రమంగా వేలల్లో తవ వర్క్ ఫోర్స్ ని తగ్గించుకోవడం చేశారు. గతేదాడి దాదాపు 2లక్షల 26వేల మందికి పైగా టెకీలు తమ ఉద్యోగాలను కోల్పోయారు. ఇక 2022లో 2లక్షల 2వేల మంది ఉద్యోగులకు టెక్ కంపెనీలు ఉద్యాసన పలికాయి. ఇక 2024 ప్రారంభం నుంచి ఇప్పటివరకు దాదాపు 95 వేల మంది ఉద్యోగులకు లేఆఫ్స్ నోటీసులు ఇచ్చా యి కంపెనీలు. గడిచిన రెండు నెలల్లోనే 20 వేల మంది టెకీలు తమ ఉద్యోగాలు కోల్పోయారంటే లేఆఫ్స్ ప్రభావంతో రోడ్డున పడ్డ టెకీలు క్రమంగా పెరిగిపోతు న్నా రని తెలుస్తోంది. 

ఐటీ లేఆఫ్స్ అనేది..ప్రముఖ ఐటీ కంపెనీలతో పాటు స్టార్టప్ కంపెనీల్లో కూడా జరుగుతోంది. ఉద్యోగిని సడెన్ గా మీటింగ్ ని పిలవడం.. అదే సమావేశంలో నెల రోజుల్లో మీరు వేరే ఉద్యోగం చూసుకోండి..లేకపోతే రిజైన్ చేస్తే 4 నెలల అడ్వాన్స్ జీతం ఇస్తామని చెప్పడం జరుగుతోందని ..అలా చేయకుంటే తొలగించడం జరుగు తుందని.. తక్షణమే నిర్ణయం చెప్పాలని ఒత్తిడి తెస్తున్నారని ఉద్యోగాలు కోల్పోయిన టెకీలు వాపోతున్నారు. అయితే ఇది ఇక్కడితో ఆగదని ఇంకా ముందుముందు భారీగా లేఆఫ్స్ ఉంటాయని తెలుస్తోంది. 

చాలా కంపెనీల్లో సైలెంట్ గా ఉద్యోగులను తొలగించడం, వారిని స్వతహాగా రాజీనామా చేయాలని చాలా కంపెనీలు ఒత్తిడి తేవడం సర్వ సాధారణం అయిపోంది. ఐటీ ఉద్యోగుల సంస్థ నాసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనెట్ (NITES) ప్రకారం.. 2024లో లార్జ్ స్టార్టప్ కంపెనీల్లో దాదాపు 2వేల నుంచి 3 వేల మంది టెకీలు ఈవిధంగానే తొలగించబడ్డారు.